కొప్పోలు గ్రామంలో బన్నీ, ప్రశాంత్, వంశీ అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ఆ ముగ్గురికి చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం. ప్రతిరోజు ముగ్గురు కలిసి బడికి తప్పకుండా వెళ్లేవారు. మాస్టారు చెప్పే పాఠాలను జాగ్రత్తగా వినేవారు. అదే తరగతిలో కార్తీక్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అల్లరి చిల్లరగా తిరుగుతూ చదివే వాళ్లను హేళన చేస్తూ ఉండేవాడు. కార్తీక్ కు చదవడం అంటే ఎంత మాత్రం విషయం ఉండేది కాదు. ముగ్గురు స్నేహితులలో ప్రశాంత్ ను కార్తీక్ తన స్నేహంతో చెడు దారి పట్టించాడు. వంశీ బన్నీ ఇద్దరు కూడా ప్రశాంత్ ను మార్చడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ప్రశాంత్ మారలేదు. కార్తీక్ మాటలు విని స్నేహితులు ఇద్దరినీ శత్రువులుగా చూస్తున్నాడు. వంశీ బన్నీ ఇద్దరినీ కూడా కార్తీక్ చెడు సావాసం పట్టించడానికి ప్రయత్నం చేసిన వాళ్లు జాగ్రత్తగా తప్పించుకున్నారు. ప్రశాంత్ కార్తీక్ చదువుకోకుండా పదవ తరగతిలో ఫెయిల్ అయ్యారు. బన్నీ వంశీ పట్టుదలతో చదువుకొనిఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. పెరిగి పెద్ద అయిన తర్వాత ఇద్దరూ గొప్ప ఉద్యోగస్తులు అయినరు. కార్తీక్ ప్రశాంత్ చదువుకోకుండా చెడు సావాసాలు చేసి నేరస్తులుగా మారారు. ఉద్యోగం చేస్తున్న బన్నీ వంశీ ఊర్లోకి వచ్చినప్పుడు ఊరు వాళ్ళందరూ ఎంతో గౌరవించారు. అది చూసి కార్తీక్ ప్రశాంత్ ఆలోచనలో పడ్డారు. మేము కూడా బాగా చదువుకుంటే వాళ్ళ లాగా గౌరవం పొందే వాళ్ళం కదా అనుకున్నారు. అప్పటినుండి చెడు బుద్ధులు మానేసి మంచిగా జీవించారు.
నీతి : చదువు వలన గౌరవం పెరుగుతుంది.
--
నీతి : చదువు వలన గౌరవం పెరుగుతుంది.
--
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి