గంగ మెచ్చిన రంగడు
ఉ.
నింగిన దైవమెప్పడును నిక్కముజాడల నీడనేనటన్
రంగుల పృథ్వి నందుమరి రంగని కేవిధి దెల్యకుండగన్
బొంగర మల్లె కార్యములు పోకడలెన్నక జేయుచుండగా
గంగయె దారినిచ్చునట కల్మషమింతయు లేనివాడనిన్
ఉ.
గంగకు మ్రొక్కి నావలికి దాటెడి చిత్రము జూడముచ్చటై
సంగతి దేల్చుకుందునని సాధ్వియె నక్కుచు నెండించి యా
రంగని మంత్ర సూత్రముల రాధిక గాంచగచాటుమాటుగన్
పొంగెడి గంగ పాయలుగ పొమ్మని వీడెను దారిజూపుచున్
ఉ.
చిత్రము జూడ రాధికకు చిత్తము నందున బుట్ట యోచనన్
పత్రము వంటి బూరెలును పాయస గారెల పిండివంటలన్
పొత్రము వోలె గిర్రుమని బోజన వేళకు జేసిపెట్టి నో
చిత్రము జేయుచుండె నతి శీఘ్రమె గూలునొ నన్నరీతిగన్
ఉ.
గొట్టము తాడుతోడ నొక గుండుకు సూదినమర్చియప్పుడున్
గట్టిగ నూడకుండనవి గట్టెనువాసపుటింటి కప్పుకున్
కట్టిన మూడు వస్తువులగత్యము నూడెన కిందనుండ యే
దిట్టపు నెత్తినైనగని దివ్యముగన్ నలు ముక్కలే మరిన్
ఉ.
మక్కువ మీరబెట్టుటకు మంచిగ గట్టిన గుండు కిందనే
చక్కగ పీఠవేసి పతి జాడకు రాధయె జూచుచుండగా
దిక్కన వచ్చుచుండ గనె దివ్యపు రంగని రూపురేఖలన్
గ్రక్కున బోయి బావికడ కాళ్ళకు నీటిని దోడుచుండెనే
ఉ.
తుండును చేతికియ్య తడి తుడ్చుక వచ్చెను బోజనంబుకై
వండీన వంటలన్నిసతి వడ్డన జేయగ గాంచెకప్పునే
నిండుగ బోజనంబుదిని నిక్కము జెప్పడదేమి చిత్రమో!
సుండిగ రాధ రంగడినిచోద్యముగా రుచి జెప్పుమా యనెన్
క.
చల్లగ రంగడు జెప్పెను
మెల్లగచిరు నవ్వు నవ్వి మితభాషితుడై
ఝల్లుమనెడి గుండునుగని
నొల్లననక దింటి గాని నెరుగ రుచిననిన్
క.
సూరున వేలాడెడి యా
భారపు తీరంబుగాంచి భక్షించిచగ నే
కూరయొ! యన్నంబో! మరి
పారెడి గంగమ్మ సాక్షి వంటను గనడే!
క.
చల్లగ రంగడు జెప్పెను
మెల్లగచిరు నవ్వు నవ్వి మితభాషితుడై
ఝల్లుమనెడి గుండునుగని
నొల్లననక దింటి గాని నెరుగ రుచిననిన్
క.
సూరున వేలాడెడి యా
భారము తీరంబుగాంచి భక్షించిచగ నే
కూరయొ! యన్నంబో! మరి
పారెడి గంగమ్మ సాక్షి వంటను గనడే!
క.
దూరము జరుగడునింతయు
సూరున నిది యేమననడు సుఖముగ దినడే
కారణ మేమైయుండునొ
ధీరుని వలె గంగ మెచ్చ తీరము దాటున్
క.
చేసెడి కార్యము లెల్లను
కూసింతయు దప్పనీక గోవుకు మిన్నై
భూసామిగ బండించును
రాసుల ధాన్యంబునైన రంగడు మనసా!
ఉ.
రంగడు వేడు సూత్రమున రాధిక నిక్కము దెల్యగోరుచున్
చెంగున నాయనమ్మ దరి జేరెను చిత్రము జెప్పమాయనిన్
బంగరు వృద్ధురాలు మరి ప్రశ్నను దేల్చెను తక్షణంబు యా
రంగడు గంగతోడ తన లక్షణ నామము జెప్పెనా యనిన్
తే.గీ
బోజనము రుచి గాంచని భోగినెన్న
పాప పుణ్యంబు లెరుగని పామరుడని
గంగ దారొడ్డె జూడుమా కారణమది
యనుచు బంగారు బాపమ్మ ఘనత జెప్పెఁ
తే.గీ
గంగ నాపేడి వినతిని రంగ డెపుడు
ప్రార్థన నుజేసి నావల్కి పయన మౌను
యన్నము రుచిని యెరుగని యల్పుని గని
దారి నిమ్మని గోరేను దయను జూపి
వ *అన్నము రుచి తెలియని వాడు తోవ్విమ్మన్నడు గంగాదేవి*

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి