విజయవాడలో ఆకాశవాణి కేంద్రాన్ని ప్రారంభించినప్పుడు దాని పేరు ఆకాశవాణి కాదు ఆల్ ఇండియా రేడియో అని. భారత దేశంలో ఉన్న అన్ని కేంద్రాలకు పేరు అదే. ప్రారంభించినప్పుడు చాలా తక్కువ మంది ఉద్యోగులతో నియమిత కార్యక్రమాలతో నడిపేవారు ఆ సమయంలో తెలుగు కార్యక్రమాలు ప్రసారం చేసే మద్రాస్ కేంద్రం నుంచి హైదరాబాద్ కేంద్రం నుంచి నాటకాలను కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను ఎన్నిక చేసి రిలే చేసేవారు ఏ శాఖకూ ప్రత్యేకమైన అధికారి లేడు అన్నీ ఒకరే చూసుకుంటూ ఉంటాడు దానివల్ల ఎక్కువ ప్రయోజనం లేదని గమనించి కొన్ని శాఖలను ఏర్పాటు చేసి దానికి నిష్ణాతులైన, సమర్ధులైన వారిని నియమించుకుంటూ ప్రయోక్త అనే పేరుతో (ప్రొడ్యూసర్) కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
మొదట నాటక శాఖ ఏర్పాటు చేసినప్పుడు రంగస్థలం పైన సినిమాలలోనూ తన ప్రజ్ఞను చాటి మంచి నటునిగా పేరు తెచ్చుకున్న బందా కనక లింగేశ్వర రావు గారిని ఎన్నుకొని విద్యా కార్యక్రమాలకు డి ఈ ఓ గా ఉద్యోగ విరమణ చేసిన కందుకూరి రామభద్ర రావు గారిని కార్మికుల కార్యక్రమానికి బెజవాడ గోపాల్ రెడ్డి గారి సన్నిహిత మిత్రుడు ఆమంచర్ల గోపాలరావు గారిని నియమించి వారికి ఆ శాఖలను అందించారు. అలా ప్రారంభమైన శాఖలు వారి కార్యక్రమాలలో వారు నిమగ్నమై వాటికి సంబంధించిన వ్యక్తులను ఎన్నుకొని వారితో చక్కటి కార్యక్రమాలు, చేసిన దానిని చేయకుండా ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలను చేయడానికి కృషి చేస్తూ విజయవాడ కేంద్రానికి మంచి పేరు తీసుకువచ్చారు.
విజయవాడ కేంద్రానికి నాటక శాఖలో వచ్చిన బందా కనకలింగేశ్వర రావు గారికి అక్కడ పని అంతా చాలా కొత్తగా అనిపించింది దానితో నటుల కోసం ప్రయత్నం చేసి మొదట నాటక శాఖలో సి రామ మోహన్ రావు తెనాలిలో రంగస్థల నాటకాలలో ప్రసిద్ధి చెందిన తన శిష్యుణ్ణి నిర్ణయించి నాటక కళాకారునిగా నియమించారు. అప్పటికి బయట నాటక బృందాలను పిలిపించి వారి నాటకాన్ని గంటకు కుదించి రేడియోకు సరిపడిన పద్ధతిలో నటులు సంగీతం ప్రతిదీ వారే నిర్వహించుకునేట్లుగా ఏర్పాటు చేశారు. అప్పట్లో బందా గారికి సాంఘిక నాటకాలపై అంత దృష్టి లేదు మొదట పౌరాణిక నాటకాలను, తర్వాత చారిత్రక నాటకాలను, ఆ తర్వాత జానపద నాటకాలను ప్రోత్సహించేవారు.
పద్మ శ్రీ బందా గారు (7);-ఏ.బి ఆనంద్ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి