జాతీయ గీతం.....;= ప్రమోద్ ఆవంచ 7013272452

 బంగాళాఖాతంలో వాయుగుండం,దాని వల్ల ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆకాశం మేఘావృతమై ఉంది.చల్లని గాలి, అప్పుడప్పుడు వచ్చి దేహాన్ని తాకుతున్నాయి,వాన చినుకులు.
కారు విండోస్ తెరిచి, చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటే,నాలో ఏదో తెలియని హాయి, ఉత్సాహం, నన్ను ఆకాశంలో,విహరింపజేస్తుంది.మిర్యాలగుడ నుంచి బయలుదేరి సరిగ్గా అరగంట అయ్యింది.ఒక్కప్పుడు
రోడ్డుకిరువైపులా పచ్చని పంట పొలాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉండేవి.రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు
పచ్చని పొలాలను, వెంచర్స్ గా మార్చి ప్లాట్లు చేస్తున్నారు.ఈ విపరీత ధోరణుల మూలంగా, వచ్చే జనరేషన్లకు, వ్యవసాయం అంటే ఏమిటో తెలియకుండా పోతుందన్న ఆందోళన కలుగుతోంది.
                      సరిగ్గా ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు తిప్పర్తి చౌరస్తాకు చేరుకున్నాం.కారులో నాతోపాటు ఇంకా ముగ్గురు మిత్రులు ఉన్నారు.అప్పుడే ఒక అరవై సంవత్సరాల వ్యక్తి, తలపాగా చుట్టుకొని, తెల్లని దుస్తులు ధరించి,చేతిలో జాతీయ జెండాను పట్టుకొని, రోడ్డు మద్యలోకి వచ్చి నిలబడ్డాడు.కారు నడుపుతున్న మిత్రుడు, సడెన్ బ్రేక్ వేసి, కారుని ఆపేసాడు.రెండు వైపుల నుంచి వచ్చే వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి.చౌరస్తాలో
 ఒక వైపు టీ హోటళ్ళు,మరొక వైపు బస్ షెల్టర్,దాని పైన గోడకు కట్టిన ఒక మైకు, బస్సు కోసం ఎదురు చూస్తున్న కొందరు ప్రయాణికులు, పాదచారులు, ద్విచక్ర వాహనాలు నడిపే వారితో,ఆ ప్రాంతం కొంత
 హడావుడిగా ఉంది.ఎనమిదిన్నరకు బస్ షెల్టర్ లో ఉన్న మైక్ నుంచి జన గణ మన... జాతీయ గీతం మొదలైంది.విచిత్రం పాదచారులు, ద్విచక్ర వాహన దారులు,ఎక్కడి వారు అక్కడే ఆగి, జాతీయ జెండాకు
 సెల్యూట్ చేస్తూ, జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు.
 ఈ హటాత్తు పరిణామానం నుంచి,కోలుకొని, నాతో పాటు నా మిత్రులు కూడా కారులోనుంచి దిగి,మేమూ జాతీయగీతాలాపనలో,పాల్గొన్నాం.కార్యక్రమం అయిపోయింది, జెండా పట్టుకున్న ఆ వ్యక్తి వెళ్లిపోయాడు.ఎవరికి వాళ్ళు మళ్ళీ ఎప్పట్లాగే,వెళ్ళిపోసాగారు.రెండువైపులా ఆగిన వాహనాలలో,కదలికలు ప్రారంభమైయ్యాయి.ఎటూ ఆగాం కదా, వేడి వేడి ఛాయ్ తాగుదామని, రోడ్డుకి ఎడమవైపున ఉన్న టీ స్టాల్ కి వెళ్ళాం.ఆ టీ స్టాల్ ఓనర్ అయ్యప్ప దీక్ష మాలలో ఉన్నాడు.నాలో క్యూరియాసిటి ఆగడం లేదు, విషయం తెలుకోవాలన్న
 ఉత్సుకతతో,అంతకు ముందు మాతో పాటు జాతీయగీతం పాడిన ఒక స్వామిని,ఈ రోజుకి ఏదైనా
 ప్రత్యేకత ఉందా, జాతీయ గీతం ఆలపిస్తున్నారు,అని
 అడిగాను, లేదు,స్వామి, ప్రజల్లో జాతీయ భావాన్ని
 పెంపొందించేందుకు,ప్రతి రోజూ ఎనిమిదిన్నరకు జాతీయ గీతాన్ని ఆలపిస్తాం.గత ఏడాదిగా,ప్రతి రోజూ ఈ సెంటర్ లో నిలబడి ఆ గీతాన్ని పాడుతున్నాం
 అని చెప్పాడు.ఊర్లో ఎవ్వరైనా ఈ సమయానికి ఎక్కడున్నా జాతీయ గీతాన్ని పాడుతారు,అని అన్నాడు....
                  ఆశ్చర్యం... ఒకరకంగా చెప్పాలంటే అద్బుతం అనే చెప్పాలి.దేశభక్తి పెంపొందించే ఈ ఆక్టివిటీ,ఎవరు మొదలుపెట్టారనీ అడిగాను.ఎవరో నాకు తెలియదు స్వామి, నల్గొండలో చాలా రోజుల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, మేము కూడా మొదలు పెట్టాం, అని సమాధానమిచ్చాడు.చదవుకున్నవాడిలా కనిపించడంతో, జాతీయ గీతాన్ని ఎవరు రాసారో తెలు‌సా స్వామి అడగ్గా,ఏమో నాకు గుర్తుకు లేదు కానీ, నేను గత ఏడాదిగా,రోజూ జాతీయ గీతాన్ని పాడుతున్నానన్నాడు. అక్కడే కొందరు స్కూలు పిల్లలు కూడా ఉన్నారు,వాళ్ళని అడిగా ఎవరు రాసారనీ, గురజాడ అప్పారావు అని ఒకరు పింగళి వెంకయ్య అనీ ఇంకొకరు.. ఎవరికి తోచిన పేర్లు వాళ్ళు చెపుతున్నారు.చివరికి టెన్త్ క్లాస్ చదివే పిల్లలు చెప్పలేక పోయారు.
                  నల్గొండలో జాతీయ గీతాలాపన జరుగుతుందా లేదా అనే విషయాన్ని కనుక్కుందామనీ నల్గొండ లోని నా జర్నలిస్టు మిత్రుడు గుడిపాటి సీను కి ఫోన్ చేసాను, కానీ సీను ఫోన్ ఎత్తలేదు.ఆ గ్యాప్ లో పరమాత్మ కి ఫోన్ చేసా, తాను అంతా ఇన్ఫర్మేషన్ చెప్పి ఒక వ్యక్తి ఫోన్ నెంబర్ ఇచ్చాడు.ఆ తరువాత సీను ఫోన్ చేసి, అన్ని విషయాలు మాట్లాడాడు....
                  అసలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది
నల్గొండకు చెందిన కర్నాటి విజయ్ కుమార్,ఈయన సబ్ ట్రెజరీ ఆఫీసులో ఉద్యోగి.ఈ మధ్యనే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని సోషల్ సర్వీస్ లో బిజీ అయ్యాడు.ఈయన మా అన్నయ్య క్రాంతి, క్లాసుమేట్ అనీ మాటల సందర్భంలో తెలిసింది.ఈ కార్యక్రమం మొదలు పెట్టడానికి ఆయనకు ఇన్స్పిరేషన్ జమ్మికుంట పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ రెడ్డి.హుజురాబాద్ దగ్గరలో ఒక
మండల కేంద్రం.కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్ళే దారిలో ఉంటుంది.ఆయన తన పోలీసు స్టేషన్ లో ఆగస్టు పదిహేనున జెండా పండుగ చెసే సమయంలో, ఎదురుగా ఉన్న ఒక ఇంటి పైనుంచి, ఇద్దరు చిన్నారులు
జాతీయ గీతం అయిపోయే వరకు సెల్యూట్ పొజిషన్ లో ఉండడం గమనించాడు.ఆ తరువాత జనవరి ఇరవై ఆరవ తేదీన జెండా పండుగను పోలీసు స్టేషన్ బయట ఏర్పాటు చేసాడు,అప్పుడు జనాలందరూ ఆగి చెప్పులు విడిచి, చాలా గౌరవంగా జాతీయ గీతాన్ని పాడి వెళ్ళిపోయారు.అప్పుడనుకున్నాడు,ఆ ఇన్స్పెక్టర్
రోజూ జాతీయ గీతాన్ని అందరితో పాడించాలనీ,అంతే అప్పటి నుంచి కార్య రూపం చేసాడు.జమ్మికుంట చిన్న టౌను,ఆ టౌనులో ఎనిమిది సెంటర్లను గుర్తించి, అక్కడ మైకులు పెట్టి, దానికి సంబంధించిన ఆప్లిఫ్లయర్ నుంచి పోలీసు స్టేషన్ లో పెట్టి, రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు జన గణ మన జాతీయ గీతాన్ని వినిపించేవాడు,అలా ఒకటిన్నర నిమిషం జాతీయ గీతం అయిపోయే వరకు పాదచారులు ద్విచక్ర వాహన దారులు, ఆగి జాతీయ గీతాన్ని పాడి, సెల్యూట్ చేసి వెళ్ళేవాళ్ళు.ఇది ఇప్పటి వరకు కొనసాగుతుంది....
కట్ చేస్తే...
                 ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలుసుకున్న కర్నాటి విజయ్ కుమార్,తన మిత్రులతో
జమ్మికుంటకు వెళ్లి,ఆ ఇన్స్పెక్టర్ ని కలిసి వివరాలు తెలుసుకున్నాడు.తిరిగి నల్గొండకు వచ్చి పట్టణంలో కూడా ప్రజలందరూ జనగణమన గీతాన్ని ఆలపించాలన్న తలంపుతో,పర్మీషన్ తీసుకోవడానికి
అప్పటి జిల్లా ఎస్పి శ్రీనివాసరావును కలిసాడు,ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు,అలా మరో ఇద్దరిని కలిసాక కూడా స్పందన రాలేదు.చివరికి ఎస్పీ రంగనాథ్ వీళ్ళ ప్రపోజల్ నుంచి ఓకే చేసాడు.అలా నల్గొండలో పన్నెండు సెంటర్లలో,టూటౌన్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో ఆప్లిఫ్లయర్ పెట్టి ప్రతి రోజూ ఎనిమిదిన్నరకు జాతీయ గీతాన్ని ఆలపించడం ప్రారంభించారు.కానీ,కూలి పనులకు వెళ్ళే వాళ్ళు,ఆ సమయంలో అక్కడే ఆగిపోయి, జాతీయ గీతం పూర్తయ్యే వరకు ఉండేవరనీ, చదువుకున్న వాళ్ళు మాత్రం ఆగకుండా పక్క సందులో నుంచి వెళ్లిపోతారనీ, జాతీయ గీతం పై గౌరవం కూడా ఉండదనీ కర్నాటి విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
                 మనం హైస్కూలు పూర్తి చేసేంతవరకు ప్రతి రోజూ వందేమాతరం, జనగణమన, ప్రతిజ్ఞ చదివి కంఠస్థం చేసిన విషయం అందరికీ తెలిసిందే.కానీ ఆ తరువాత రోజుల్లో వాడకంలో లేకపోవడం మనలో చాలామందికి పూర్తిగా జ్ఞాపకం లేకపోవడం గమనార్హం.
 జనగణమన జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్, వందేమాతర గీతాన్ని బంకించంద్ర ఛటర్జీ, ప్రతిజ్ఞ ను
 పైడిమర్రి వెంకట సుబ్బారావు రాసారని ఇప్పటి జనరేషన్ పిల్లలు చాలా మందికి తెలియదు అని చెప్పడానికి సిగ్గుగా ఉంది.ప్రతి రోజు దేశం గురించి, దేశభక్తి పెంపొందించే అంశాలను తరగతి గదిలో విధిగా బోదించడమే కాకుండా, ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు,ఆ‌సుపత్రులు, కార్యాలయాల్లో జాతీయ గీతాన్ని ఆలపించాలన్న విధానాన్ని అమలు చేయాలి.
దాన్ని ఆచరించే విధంగా చర్యలు తీసుకోవాలి.
                         ప్రస్తుతం జనాలకు జబ్బు చేసినట్లు
 డబ్బు చేసింది, దేశాన్ని దోచుకుతినడంలో,క్షణం తీరిక లేకుండా ఉన్నారు.డబ్బు మితిమీరి సంపాదించడంతో
 ఒక విధమైన భయం ఏర్పడింది...ఆ భయంతో భక్తి ఎక్కువయ్యింది.భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు...అని చదువుకున్న ప్రతిజ్ఞను చిన్నప్పటికే పరిమితం చేసి,దేశాన్ని చులకన భావంతో చూస్తున్నాం.దేశాన్ని ఎవరేమన్నా అంటే అంత సీరియస్ గా తీసుకోం కానీ భక్తి విషయంలో ఎవరినేమన్నా వారి మనోభావాలు దెబ్బతింటాయి.కులం,మతం, పార్టీల మత్తులోకి దిగజారి పోతున్న వ్యవస్థకు చికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.దేశం గురించి ఎవరైనా మాట్లాడితే,అది ఏదో ఒక పార్టీ మానిఫెస్టో అనీ ఫీల్
అవుతున్నారు.మతాలు,కులాలు, పార్టీలకతీతంగా
ప్రతి ఒక్కరూ,బాధ్యత గల దేశ పౌరులుగా మరే ఆ సమాజాన్ని మనం చూడగలమా....
                           
కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం