పెద్ద కార్పొరేట్ హాస్పిటల్... దాని ముందు రయ్ మంటూ వచ్చి ఒక ఫార్చునర్ కారు ఆగింది.అందులోనుంచి ఓ పెద్దాయన కిందికి దిగాడు.
ఖద్దరు దుస్తులు ధరించి,చేతికి బంగారు కడియంతో పాటు,మెడలో బందోబస్తు చ్చైన్స్,వేళ్ళకు బంగారు ఉంగరాలు ఉన్నాయి.హాస్పిటల్ లోకి సరాసరి నడుచుకుంటూ వెళ్ళి, ఆరోగ్యశ్రీ కియాష్కీ దగ్గరకు వెళ్ళాడు.అక్కడున్న ఆరోగ్య మిత్ర లేచి నిలబడి,సార్ ఏం కావాలండి అని అడిగాడు, వెంటనే ఆ పెద్దాయన జేబులో నుంచి తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ లు తీసీ,మా నాయనకు హార్ట్ ఆపరేషన్ చేయించాలి,మీ హాస్పిటల్ లో పనిచేసే కార్డియాలజిస్ట్ చెప్పారు.ఇదిగో,తెల్ల రేషన్ కార్డు,ఆరోగ్య శ్రీ కార్డు రెండు ఉన్నాయి తీసుకోండి అంటూ ఇచ్చాడు.ఆరోగ్యశ్రీ
కింద అడ్మిట్ చేసుకోండి అని చెపుతుంటే,ఆ ఆరోగ్య మిత్ర ముఖంలో,ఆశ్చర్యం,అయోమయం రెండూ తాండవం చేసాయి.అయినా తమాయించుకుని, ఓకే సార్, మీరు పేషెంట్ నుంచి అడ్మిట్ చేయండి, నేను ప్రీ ఆథరైజైషన్ కి సబ్మిట్ చేస్తాను అని వినయంగా చెప్పాడు....ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేసేటేమిటంటే, ఆర్థికంగా బాగున్న వాళ్ళకు, కూడా తెల్ల రేషన్ కార్డులు.. ఆరోగ్యశ్రీ కార్డులు..ఇదీ సంగతి అధ్యక్షా....కట్ చేస్తే...
ఒక హాస్పిటల్.. దాని యజమాని ఫలానా డాక్టర్, సీరియస్ గా పేషెంట్లను,చూస్తున్నాడు.అందులో ఒక పేషెంట్ అంతకంటే సీరియస్ గా, ఆరోగ్య శ్రీ కార్డు తీసుకుని వచ్చి,సార్ రెండు నెలల క్రితం నేను మీ దగ్గర
ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేయించుకున్నాను,ఈ కార్డు చూసి, ఇంకా ఎంత బాలెన్స్ ఉందో, చెపుతారా.. అంటూ అడిగాడు, ఆరోగ్య శ్రీ కార్డు ఏదో బ్యాంకు ఎటిఎం కార్డులా...అది విన్న ఆ డాక్టర్ ఏం మాట్లాడాలో తెలియక నోరు వెళ్ళబెట్టాడు...కట్ చేస్తే....
ఇంకో చోట డాక్టర్ పేషెంట్లు లేక ఖాళీగా కూర్చున్నాడు.ఒక వ్యక్తి ఆరోగ్య శ్రీ కార్డు తీసుకుని వచ్చి, డాక్టర్ గారు, నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో
ఉన్నాను.ఈ కార్డు తీసుకుని, నేను అడ్మిట్ అయినట్లు
రికార్డులలో చూపించి, ఆరోగ్య శ్రీ నుంచి వచ్చే డబ్బుల్లో
చెరొక లక్ష రూపాయలు తీసుకుందాం, దయచేసి ఈ సహాయం చేయండి అంటూ ప్రాధేయపడ్డాడు....అది ఎలా సాధ్యం అంటూ ఆ డాక్టర్, ఆశ్చర్యానికి గురి అయ్యాడు....కట్ చేస్తే...
రెండు వేల ఏడు,సంవత్సరంలో, అప్పటి
ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి, పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించేందుకు ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు.మద్రాస్ కి చెందిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భాగస్వామ్యంతో, రాష్ట్ర ప్రభుత్వం
అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.ఆరోగ్యశ్రీ పధకానికి ఐఏఎస్ అధికారి బాబు ను,సీయిఓగా నియమించింది.అప్పట్లో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా ఆయనకు మంచి పేరు ఉండేది.చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని అందరూ అనేవారు.ప్రారంభంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన జిల్లా హెడ్ క్వార్టర్స్ లలో, ప్రైవేటు ఆసుపత్రులతో, మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించారు.ఆరోగ్యశ్రీ పథకానికి ప్రభుత్వం సంవత్సరానికి తొమ్మిది వందల కోట్లు కేటాయించేది.ఆ మొత్తాన్ని ఆరోగ్య శ్రీ పథకంలో ప్రజలకు ఉచితంగా చికిత్స చేసిన ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించేది.
ప్రతి జిల్లాలో నెట్వర్క్ హాస్పిటల్స్, పీహెచ్ సి హాస్పిటల్స్ అని రెండు విభాగాలుగా విభజించి,ఆ జిల్లా కోఆర్డినేటర్ గా ఒక సీనియర్ డాక్టర్ ను, నియమించి,ఆ తరువాత ఒక డీజిఎం, ఆయన కింద నలుగురు రీజియేనల్ కోఆర్డినేటర్స్, ఒక్కొక్క ఆర్సీ కింద నలుగురు లేదా అయిదుగురు ఆరోగ్య మిత్ర లు.ఇదీ హైయరార్కీ.ఆరోగ్యమిత్రలు చాలా ముఖ్యమైన భూమికను పోషిస్తారు.ప్రతి హాస్పిటల్ లో, ఆరోగ్య శ్రీ వ్యవహారాలు చూసుకునేందుకు ఉండే డాక్టర్ ని రామ్ కో(Ramco)అనీ, హెల్త్ క్యాంపులను కోఆర్డినేట్ చేసే వ్యక్తిని,యామ్ కో(Amco) అనీ అంటారు...కట్ చేస్తే...
ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకానికి
సుస్థి చేసింది...అంటే ఆరోగ్యం చెడిపోయింది.ఆరోగ్యశ్రీ
పథకానికి నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం, ప్రదాన కారణం.అప్పట్లో సంవత్సరానికి తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఇప్పుడు చేయడం లేదు.ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు లక్షల్లో ఉన్నాయి,ఇది సత్యం.ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన నిజం.దానికి కారణాలేమిటో ప్రభుత్వమే చెప్పాలి.రాష్ట్రంలో చాలా ఆసుపత్రులకు 2020 నుంచి బిల్లులు పెండింగులో ఉన్నాయి.మామూలుగా ఒక ఆసుపత్రికి, ఆరోగ్య శ్రీ కింద అడ్మిట్,పేషెంట్లకు అయ్యే ఖర్చుని పరిశీలిస్తే ఆపరేషన్ టైంలో అనస్థటిస్ట్ ఫీజు, అప్పుడు వాడే ఇంప్లాంట్స్ ఖర్చు,సర్జన్ ఫీజు,పేషెంట్ ఆసుపత్రిలో
ఉన్న రోజుల్లో వాళ్ళకు పెట్టే ఫుడ్ ఖర్చు...ఇలా రకరకాల ఓవర్ హెడ్స్ గురించి ఆలోచిస్తే,ఆ సర్జరీకీ, ప్రభుత్వం చేల్లించే,డబ్బులు ఏ మాత్రం సరిపోవు.
ఇది కాకుండా హరిజనులు, గిరిజనుల
పేషేంట్లకు సంబంధించిన అటెండెర్స్ కి కూడా మూడు పూటలా భోజనం పెట్టాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.పేషేంట్ సమస్యతో వచ్చినప్పుడు అతనికి ఉన్న రోగం గురించి ఆలోచిస్తాం కానీ, కులం, మతం గురించి మేము అడగం,ఆ ఆలోచనే మాకు రాదని డాక్టర్లు అంటున్నారు.నిజమే డాక్టర్లు ప్రతి పేషెంట్ ను ఒకేలా చూస్తారు.మనిషికి వచ్చిన వ్యాధిని తగ్గించాలనీ, వాళ్ళు చదువుకునే రోజుల్లోనే,ప్రతిజ్ఞ చేస్తారు.కానీ కొందరు డాక్టర్లు ఆరోగ్య శ్రీ నీ, దుర్వినియోగం చేసి,తమ స్వప్రయోజనాల కోసం వాడుకున్న,సంఘటనలు మనం ఎన్నో వింటున్నాం.అవి ఎంత వరకు నిజమో తెలియదు.
ఒక దశలో ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసేయాలనీ కూడా ఆలోచించిందనీ,ఒక వార్త.కానీ తీసివేసే సహాసం, చేయలేదు.అందులోనీ మర్మమేమిటో తెలుసుకో మిత్రమా ...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి