నిన్న నీవు దూరమైనావు
నా హృదయం భార మైంది
దొంతరలు దొంతరలుగా
దొర్లుతున్న నీ జ్ఞాపకాలు
మనస్సు గది మూలల్లో
సాగుతున్న నీడలు
దిక్కు తోచక దరిగానని
సముద్ర తీరం వెంట
పయనిస్తున్న జాడలు
వెంటాడుతు వేధిస్తున్న యీ
మనో వ్యధ తీరనిది !
చిరకాలం కలిసి ఉండాల్సింది
చిత్రంగా వెళ్ళిపోయావు
చిద్విలాసంగా వీడి పోయావు
కనిపించగానే నీ ముఖబింబంపై
చెక్కుచెదరని చిరునవ్వు
అవ్యాజమైన ప్రేమ
కొదువ లేని ఆప్యాయత
కొండ శిఖరంలా
నిశ్చలంగా నిండుగా
మేరు నగ ధీరుడిలా ఉండేవాడివి!
ఆరడుగుల ఎత్తు
అజాను బాహుడవై
మూర్తీభవించిన
అందమైన రూపులో
అలనాటి అందాల నటుడు
శోభన్ బాబును
తలదన్నేలా –
నడక లో ఠీవి
రాజసం ఉట్టిపడేలా
ఎవరో గొప్పవారు అన్నట్టు
అగుపించేవాడివి!
జీవితంలో నీవు
ఆస్తులను సంపాదించలేదు
ఉన్న ఆస్తులనే
హారతిలా కరిగించి
ఉన్నతంగా ఎదగాలని
ఉబలాట పడ్డావు
నిరాశా నిస్పృహలతో కుంగిపోక
నిబ్బరంగా వ్యాపారం చేసావు
రంగుల మాయాలోకం హంగులు ఆర్భాటాలు
పోటీ ప్రపంచంలో
వ్యాపారం కొనసాగక కొన్నాళ్లు
జీవితంలో యెంతో
ఉన్నతంగా
ఎదుగుతున్న క్రమంలో
అనారోగ్యం కాటేసి
అర్ధాంతరంగా అనివార్యంగా
దేహం చాలించి
మరలి రాని లోకానికి
తరలి వెళ్ళిపోయావు,--
బిడ్డ పెళ్లి చూడకుండానే
ఎందుకయ్యా వెళ్ళిపోయావు!
ఆశల ప్రతిరూపంగా
అనురాగాలు పంచే
చక్కనైన చిక్కని
అందాల కూతురు
చదువు సంస్కారం
విద్య వివేకం కొరకు
విద్యాలయంలో చేర్పించి
చదువు పూర్తి కాకుండానే
సరస్వతి కటాక్షం పొందకుండానే
విజయ వార్తలు వినకుండానే
పెను విషాదంలో ముంచివేసి
కలలు కోరికలు అన్నీ విడిచి
కదం తొక్కుతూ వెళ్ళిపోయావు!
ఎప్పుడు ఎల్లవేళలా
ఏదో చేయాలని
ఎడతెగని ఆరాటం
మనసు నిండా ఉత్సాహం
నీ ఆశలు ఆశయాలు
పరిపూర్తి కాకుండానే
అనివార్యంగా వెళ్ళిపోయావు!
ఎన్నెన్ని స్వప్నాలు
దిగంతాలు చేరాలనే తపన
ఆప్యాయంతో అనురాగంతో
చూసుకునే మమ్ము
ఇప్పుడెవరు ఆదరించాలి
ఈరోజు ఎంతో కోల్పోయాం
ఎవరితో కలివిడిగా గడపాలి
ఏది పండుగ వాతావరణం
అనుబంధాలకు
ప్రతిరూపం నీవు
అంతా శూన్యంగా తోస్తుంది
నీవు దూరమైన
నీ జ్ఞాపకాల దొంతరలు
మధుర స్మృతులై
మల్లియలు పూస్తున్నాయి
మీ ఆరోగ్యం కోసం
చిన్న వదిన ఏడుపులు రాగాలు
వద్దు అని ఓదార్చేది
ధైర్యం చెప్పేది
నీ చెల్లి నిన్ను గూర్చి
అనవరతం
గుర్తుకు తెచ్చుకునేది
నీ అనారోగ్యం తలచుకొని
వెక్కి వెక్కి ఏడ్చేది
ఎవ్వరికి అర్థం కాని నీవు
ఏదో లోకంలో ఉన్నట్టు
నీ పని నీవు—
మౌనంగా చేసుకుంటూ
ఎదుగుతున్న క్రమంలో
అనారోగ్యం
నిన్ను కబలించింది
సుదూర లోకాలకు చేర్చింది
అందరి హృదయాల్లో
బందీ అయిన నిన్ను
అనుబంధమంతా అమాంతంగా
చెరిగిపోయింది
కాలం తీసుకుపోయింది
మంచితనాన్ని మొండితనాన్ని
నీ ధైర్యాన్ని గుర్తు చేస్తున్నాం
ఇవాళ ఇక్కడ చేరారు
మది నిండా నీ గురించిన ఆలోచనలే
పేరుపేరునా తలచుకుంటున్నాం
నీ తల్లి భార్యా
శోక సముద్రంలో మునిగిపోయారు
నీ బంధువులంతా విలపిస్తున్నారు
నీ ఆత్మకు శాంతి చేకూర్చాలి
నీవు చేసిన సేవ మరువరానిది
మీ మానవతావాదం మరపురానిది.
రచన: నరేంద్ర సందినేని
హామీ పత్రం
సాయినాథ్ స్మృతి కవిత.ఇది నా సొంత రచన.అనువాదం,అనుసరణ కాదు వెబ్సైట్లో కాని పత్రికల్లో కాని ప్రచ్రురింపబడలేదు.హామీ ఇస్తున్నాను.
నా హృదయం భార మైంది
దొంతరలు దొంతరలుగా
దొర్లుతున్న నీ జ్ఞాపకాలు
మనస్సు గది మూలల్లో
సాగుతున్న నీడలు
దిక్కు తోచక దరిగానని
సముద్ర తీరం వెంట
పయనిస్తున్న జాడలు
వెంటాడుతు వేధిస్తున్న యీ
మనో వ్యధ తీరనిది !
చిరకాలం కలిసి ఉండాల్సింది
చిత్రంగా వెళ్ళిపోయావు
చిద్విలాసంగా వీడి పోయావు
కనిపించగానే నీ ముఖబింబంపై
చెక్కుచెదరని చిరునవ్వు
అవ్యాజమైన ప్రేమ
కొదువ లేని ఆప్యాయత
కొండ శిఖరంలా
నిశ్చలంగా నిండుగా
మేరు నగ ధీరుడిలా ఉండేవాడివి!
ఆరడుగుల ఎత్తు
అజాను బాహుడవై
మూర్తీభవించిన
అందమైన రూపులో
అలనాటి అందాల నటుడు
శోభన్ బాబును
తలదన్నేలా –
నడక లో ఠీవి
రాజసం ఉట్టిపడేలా
ఎవరో గొప్పవారు అన్నట్టు
అగుపించేవాడివి!
జీవితంలో నీవు
ఆస్తులను సంపాదించలేదు
ఉన్న ఆస్తులనే
హారతిలా కరిగించి
ఉన్నతంగా ఎదగాలని
ఉబలాట పడ్డావు
నిరాశా నిస్పృహలతో కుంగిపోక
నిబ్బరంగా వ్యాపారం చేసావు
రంగుల మాయాలోకం హంగులు ఆర్భాటాలు
పోటీ ప్రపంచంలో
వ్యాపారం కొనసాగక కొన్నాళ్లు
జీవితంలో యెంతో
ఉన్నతంగా
ఎదుగుతున్న క్రమంలో
అనారోగ్యం కాటేసి
అర్ధాంతరంగా అనివార్యంగా
దేహం చాలించి
మరలి రాని లోకానికి
తరలి వెళ్ళిపోయావు,--
బిడ్డ పెళ్లి చూడకుండానే
ఎందుకయ్యా వెళ్ళిపోయావు!
ఆశల ప్రతిరూపంగా
అనురాగాలు పంచే
చక్కనైన చిక్కని
అందాల కూతురు
చదువు సంస్కారం
విద్య వివేకం కొరకు
విద్యాలయంలో చేర్పించి
చదువు పూర్తి కాకుండానే
సరస్వతి కటాక్షం పొందకుండానే
విజయ వార్తలు వినకుండానే
పెను విషాదంలో ముంచివేసి
కలలు కోరికలు అన్నీ విడిచి
కదం తొక్కుతూ వెళ్ళిపోయావు!
ఎప్పుడు ఎల్లవేళలా
ఏదో చేయాలని
ఎడతెగని ఆరాటం
మనసు నిండా ఉత్సాహం
నీ ఆశలు ఆశయాలు
పరిపూర్తి కాకుండానే
అనివార్యంగా వెళ్ళిపోయావు!
ఎన్నెన్ని స్వప్నాలు
దిగంతాలు చేరాలనే తపన
ఆప్యాయంతో అనురాగంతో
చూసుకునే మమ్ము
ఇప్పుడెవరు ఆదరించాలి
ఈరోజు ఎంతో కోల్పోయాం
ఎవరితో కలివిడిగా గడపాలి
ఏది పండుగ వాతావరణం
అనుబంధాలకు
ప్రతిరూపం నీవు
అంతా శూన్యంగా తోస్తుంది
నీవు దూరమైన
నీ జ్ఞాపకాల దొంతరలు
మధుర స్మృతులై
మల్లియలు పూస్తున్నాయి
మీ ఆరోగ్యం కోసం
చిన్న వదిన ఏడుపులు రాగాలు
వద్దు అని ఓదార్చేది
ధైర్యం చెప్పేది
నీ చెల్లి నిన్ను గూర్చి
అనవరతం
గుర్తుకు తెచ్చుకునేది
నీ అనారోగ్యం తలచుకొని
వెక్కి వెక్కి ఏడ్చేది
ఎవ్వరికి అర్థం కాని నీవు
ఏదో లోకంలో ఉన్నట్టు
నీ పని నీవు—
మౌనంగా చేసుకుంటూ
ఎదుగుతున్న క్రమంలో
అనారోగ్యం
నిన్ను కబలించింది
సుదూర లోకాలకు చేర్చింది
అందరి హృదయాల్లో
బందీ అయిన నిన్ను
అనుబంధమంతా అమాంతంగా
చెరిగిపోయింది
కాలం తీసుకుపోయింది
మంచితనాన్ని మొండితనాన్ని
నీ ధైర్యాన్ని గుర్తు చేస్తున్నాం
ఇవాళ ఇక్కడ చేరారు
మది నిండా నీ గురించిన ఆలోచనలే
పేరుపేరునా తలచుకుంటున్నాం
నీ తల్లి భార్యా
శోక సముద్రంలో మునిగిపోయారు
నీ బంధువులంతా విలపిస్తున్నారు
నీ ఆత్మకు శాంతి చేకూర్చాలి
నీవు చేసిన సేవ మరువరానిది
మీ మానవతావాదం మరపురానిది.
రచన: నరేంద్ర సందినేని
హామీ పత్రం
సాయినాథ్ స్మృతి కవిత.ఇది నా సొంత రచన.అనువాదం,అనుసరణ కాదు వెబ్సైట్లో కాని పత్రికల్లో కాని ప్రచ్రురింపబడలేదు.హామీ ఇస్తున్నాను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి