పద్మ శ్రీ బందా గారు (8);-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆ తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత బందా గారు సొంత నాటకాలు వ్రాసి వాటిని నిర్వహించడం మొదలుపెట్టారు. వారు రాసిన పూటకూళ్ళమ్మ నాటిక  ప్రతిసంసారంలో జరిగే విషయాలను కథా వస్తువుగా తీసుకొని రాసిన నాటకం  ఆనాటికలో వేషానికి  సీతారత్నమ్మ గారు పలికే పద్ధతి  దీనికి సరిపోతుంది అని భావించి నాగ రత్నమ్మ గారి ద్వారా ఆమెను ఆడిషన్ కు పిలిపించి ఆ వేషాన్ని  చదివించారు.  ఆవిడ చదివిన పద్ధతికి ఇంకొంచెం మెరుగులు దిద్ది  ఆ నాటికకి జీవం వచ్చేలా ఏర్పాటు చేశారు బందా గారు  ఆ నాటకం రికార్డింగ్ అయిపోయిన తర్వాత  అప్పటికప్పుడు సీతారత్నమ్మ గారిని ఆడిషన్ లేకుండానే  నాటక కళాకారిణిగా ఎన్నిక చేసి  ఆమెకు  అధికారపత్రాన్ని అందజేశారు.ఆమె నాగరత్నమ్మ గారు ఎంతో ఆనందించారు.
నాటక శాఖలో జరిగిన అద్భుతాలు బందాగారి సమయంలో  గణపతి నాటకం చదివినవారు  హాస్యబ్రహ్మ నండూరి సుబ్బారావు గారిని,సీతా రత్నమ్మ గారిని  దృష్టిలో పెట్టుకొని వారిద్దరినీ ప్రధాన పాత్రలు చేసి నాటకం మొత్తం  వ్రాసిన తర్వాత నిడివి పెద్దది కావడంతో  విజయవాడ కేంద్రంలో మొదటిసారిగా  గణపతి నాటకాన్ని సీరియల్ (ధారావాహిక) గా ప్రసారం చేశారు. నటీనటులతో పాటు బందా గారు  నిర్వహించిన ఆ నాటకంతో విజయవాడ కేంద్రానికి మంచి పేరు నాటకం అంటే విజయవాడ వారే చేయాలి అన్న ఖ్యాతి వచ్చింది  అదే నాటకాన్ని మూడు సంవత్సరాల తర్వాత తెన్నేటి హేమలత గారు కొన్ని మార్పులు చేర్పులు చేసి  సీతారత్నం గారినీ, సుబ్బారావు గారిని  ఆ పాత్రలతో మళ్లీ ధారావాహికగా ప్రసారం చేసింది  దానికి అద్భుతమైన పేరు  నాటక నిర్వహణలో లత గారు కూడా అందివేసిన చేయి అని రుజువు చేసింది. తరువాత శ్రోతలు వేలమంది గణపతిని మళ్లీ వినిపించమని  ఉత్తరాలు రాయడంతో  నండూరి సుబ్బారావు గారు కలుగజేసుకొని  అంతకుముందు ప్రసారం చేసిన నాటకాన్ని గంటన్నరకు  కుదించి  ఒక్కసారే ప్రసారం చేశారు. తర్వాత సుమన్ ఆకాశవాణికి వచ్చిన తర్వాత  అతను రాసిన ప్లాస్టిక్ పూలు సీరియల్ నాటకాన్ని నేను నిర్వహించి నేనే ప్రధాన పాత్ర అది అందరికి నచ్చిన తర్వాత ఓ సంవత్సరం  ఆగి నటీనటులను మార్చి  జంధ్యాలని పిలిచి అతనికి ప్రధాన పాత్రను ఇచ్చి నేను  కథానాయిక తమ్ముని పాత్రలో నటించాను  నాటకం మొత్తం అయిన తర్వాత జంధ్యాల  నేను పేరుకే కథానాయకుడు గాని నాటకం మొత్తం  నిలబెట్టింది మీ పాత్ర మీకు వచ్చిన పేరు మాకు ఎవరికీ రాదు అని చెప్పడం విశేషం.కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం