మా ఆత్మీయుడు భాస్కర్ (9);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9493811322
 ఈ రోజున భాస్కర్ మారుమూల గ్రామంలో జన్మించినవాడు  కేంద్ర రాజధానిగా ఉన్న ఢిల్లీలో ఇందిరా గాంధీ దగ్గర నుంచి అనేకమందికి  సలహాదారుగా ఉండి తన గ్రామానికి ఎంతో పేరు ప్రతిష్టలు తెస్తున్నవారు  కులమత వర్గ వర్ణ విచక్షణ లేకుండా అందరినీ తన సొంత కుటుంబాలుగా గౌరవించే వ్యక్తిగా ఈరోజు  అందరూ పొగుడుతున్నారంటే దానికి మొదట అంకురం అమ్మ దానిని పెంచింది నాన్న  వారిద్దరి సంస్కారం మన  సంప్రదాయాన్ని  ఈతోధికంగా పెంచింది  దాదాపు 60 సంవత్సరాలుగా ఎంతో మంది దేశ నాయకులు  ఎన్నో ప్రభుత్వాలు మరెన్నో మంత్రిత్వ శాఖలకు సలహాదారుగా సేవలు అందించడమే కాక దేశంలో సమాచార రంగంలో ప్రజల నాడి వాడి విషయంలో ప్రతి ఒక్కరి మనస్తత్వాలను పరిచయం చేసిన వ్యక్తి. ఆ విషయాలను గురించిన అనేక ఉదాహరణలతో చాలా పుస్తకాలు కూడా రాశారు. ఆయన తన గ్రామంలోనే మాతృభాష మాధ్యమంలోనే చదివినవాడు పరాయి భాష  శిరసా వహించినవాడు కాదు  అయినా అటు ఆంగ్లంలోనూ ఇటు హిందీలోనూ అనర్గళం గా మాట్లాడగలిగిన శక్తి సంపాదించుకున్న వ్యక్తి
భారతదేశంలో  రెండు అమెరికాలో రెండు యూనివర్సిటీలలో పి.హెచ్.డి చేసి ముదునూరు ప్రాంతానికి  ఎంతో పేరు తెచ్చినవాడు. ఆయన జలంధర్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, హైదరాబాదులో ఉన్నా  ముదునూరు గురించి తప్ప  మరొక విషయం ఆయన మెదడుకు రాదు. ముదునూరులో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ  33 సంవత్సరాల క్రితం  బి ఆర్ ఈ ఏ డి అనే సంస్థను స్థాపించి దాని ద్వారా ఎంతోమంది విద్యార్థులు  1500 మందికి పైగా  పాఠశాలల్లో ప్రత్యేక గ్రంథాల స్థాపనకు కారకుడు అయ్యారు. సీఎంఎస్ వంటి అధ్యయన సంస్థలను ప్రారంభించి  అనేక విషయాలను గురించి పరిశోధన చేసి  సాంఘిక రాజకీయ పరిస్థితులస్థితిగతులను  గ్రంథస్తం చేసిన  వివేచనాపరుడు.
మా నాన్నగారు కాకాని వెంకటరత్నం గారు, డాక్టర్ మరుపూరి కోదండ రామిరెడ్డి గారు, డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారు  చెరసాలలో ఒకే గదిలో ఉండి  అనేక రాజకీయ విషయాలను గురించి మాట్లాడుకుంటూ  ప్రత్యేకించి మహాత్మా గాంధీ చెప్పిన విషయాలను  చర్చించుకుని  ఏం చేయాలో నిర్ణయించుకునేవారు  హలో జరిగిన తర్వాత 40,000 స్వాతంత్రం రావడం  మనవారు ప్రభుత్వం ఏర్పాటు చేయడం  ఎన్నికల సమయంలో కాకాని వెంకటరత్నం గారు  మా నాన్నగారు లేకుండా ఉపన్యాసం చేసేవారు కాదు  ప్రతి వేదిక పైన  వారు కాంగ్రెస్ సిద్ధాంతాలను పరిధిలోకి తీసుకు వెళ్లేవారు.  తర్వాత కాకాని వారు వ్యవసాయ మంత్రిగా ఎన్నికైన తర్వాత  మా గ్రామంలో గాంధీ కస్తూరిబా విగ్రహ ప్రతిష్ట కోసం  తర్వాత సుభాష్ చంద్రబోస్ విగ్రహం  ఆవిష్కరణ సభకు వచ్చి మాట్లాడి  నాన్నతో కాలక్షేపం చేసి వెళ్లేవారు.


కామెంట్‌లు