*నీతికథ:-(తేటగీతులతో)*;-మమత ఐలహైదరాబాద్9247593432
చిలక జ్యోష్యంబు కొరకని పలుకులెన్నొ
నేర్పి పలికించ జూదురు నిక్కముగను
వారి యానంద మందున బందినేను
యనుచు నిట్టూర్చె చిలకమ్మ తనదుచెంద

అయ్యొ! నీకిన్ని బాధలా యనుచు మదిన
నడిగె పక్షిలో నానంద నందనముల
ననుభవించెడి పక్షికై నార దీసె
నెమలి నామంబు జెప్పుచున్ నిలచి చిలక




కామెంట్‌లు