నాన్నమ్మ బీరువా;-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445
   నాన్నమ్మ బీరువా అంటే ఎంతో ఇష్టం
   నాన్నమ్మ అధ్బుత సేకరణలు నా
   మనస్సును దోచేసేవి బోలెడు!
   నగిషీల పాత్రలు,బంగారు జరీ పట్టు చీరలు
   ఇప్పటితరం చూడని చిత్రమైన రాచ్చిప్పలు!
    చైనా పింగాణీ బొమ్మలు,అలనాటి సుమతీ
    శతకం, అబ్బో ఎప్పటి పెద్దబాల శిక్ష!
    మనస్సుకు ఆనందం ఇచ్చే బెల్జియం
   గాజు సామానులు! అందులో ఎన్ని
   ఉపయోగించిందో నాకేమి తెలుసు?
   బీరువా తెరిస్తే వింత పాత వాసన!
    ఏదైనా పాతపడవలసిందే కదా!
    నాన్నమ్మ కాలంతో పాటు జీవితంలో
    ముదిమిని కౌగలించక తప్పలేదు.
    నాన్నమ్మ కాలంతో పాటు కరగిపోయింది,
     బీరువా తీస్తే నాన్నమ్మ కళాత్మక హృదయం
     కనబడింది! నాకు కావలసిన నగిషీలు
     చెక్కిన గ్లాసులు,నగిషీలలో ఓలలాడే
      చెంచాలు తీసుకున్నాను. వాటిపై
     దుమ్ము తుడిస్తే నిగనగలాడుతూ నాన్నమ్మ
      చిరునవ్వు కనబడింది!
      అంతకన్నా నేనేమీ చూడలేక పోయాను!
(ఎలిజబెత్ జెన్నింగ్స్ కవితకు అనుసృజన)


కామెంట్‌లు