కొప్పరపు సుబ్బారావు; -కొప్పరపు తాయారు.సెల్ ;:9440460797

 "జగమెరిగిన బ్రహ్మణునికి జంధ్యమేల"? అని అంటారు!
నేను శ్రీ కొప్పరపు సుబ్బారావు గారు గురించి మాట్లాడటానికి, రాయడానికి,ప్రయత్నిస్తున్నానంటే అది ఒక విశేషమే.ఎందుకంటే ఆయన నా మామగారు కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే నేను అడుగుపెట్టక ముందే మా వారు తన తల్లిని తండ్రిని ఇద్దరినీ పోగొట్టుకున్నారు!
వారి అక్కయ్య గారితో కలసి ఉండేవారు,ఆమె పేరు భారతీదేవి ఆమెకు వారి నాన్నగారు గురించి అన్ని విషయాలు తెలుసు అంచేత అనర్గళంగా చెప్పేవారు.
కానీ నాకు అప్పటికి అంత పరిజ్ఞానం,లోకజ్ఞానం లేకపోవడం వల్ల ఆ విషయాలను,నేను రాయాలని గాని తెలియక తప్పు చేసాను.కానీ మస్తీష్కల్లో నిక్షిప్తమైన కొన్ని అంశాలు అప్పుడప్పుడు ప్రస్తావిస్తాను.ఇప్పుడు ఇదే ఒక వజ్రపు తునక.
గొప్ప రచయిత నాటక కర్త సర్వం ఆయనే ఎందుకంటే నాటకాలు రాయడం దర్శకత్వం,సంగీతం
అన్ని రంగాలలో నిష్ణాతులు. ఆయన సినిమాలు తీశారు వాటి కథ పాటలు,పాటలు రచనలు,HMV లో సంగీతం దర్శకత్వం అన్నీ చేశారు. అటువంటి విద్వత్తు ఉన్న
మహానుభావుడు గురించి నేను చేపట్టిన కార్యం చంద్రుడికి ఒక నూలు పోగు లాగా.
మా మామగారు 18 సంవత్సరాల కి కాలినడకన సోల్జరుగా మెసపటోమియా అంటే నేటి ఇరాక్ దేశానికి వెళ్లారట.
అప్పుడు ఆ ప్రయాణంలో '"రోషనారా"' అనే నాటకాన్ని రచించారట.ఆ తర్వాత వెళ్ళినప్పుడు గొప్ప లైటింగ్ అరేంజ్మెంట్ కొనుక్కొచ్చారంట దాని ఖరీదు లక్ష రూపాయలు అప్పుడు ఇక్కడ ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఆ కాలంలో రోషనారా నాటకాన్ని నిషేధించారు అప్పటి ప్రభుత్వం. దాని ప్రదర్శనకి అంతరాయం ఏర్పడింది.ఉభయగోదావరి జిల్లాలో ఒక జిల్లాలో ప్రదర్శించవచ్చు అని అవకాశం ఇచ్చారు మరి రెండోది గోదావరి జిల్లాకి ప్రదర్శన కావాలని  ఆ జిల్లా  వారు కోరేరు,ఆయన ఏం చేశారంటే అనుమతి ఉన్న గోదావరి ఒడ్డున రంగస్థలం ఏర్పరిచి తాను తెచ్చిన దీపకాంతులతో శబ్ద తరంగాలని వారికి కనిపించేట్టు వినిపించేట్టు ఏర్పరిచి వారందరికీ సంతోషాన్ని కలిగించారని.
ఇదే తన ప్రజ్ఞాపాటవాలను నిరూపించుకోడం అంటారు! అంతటి గొప్ప వ్యక్తి మా మామగారు శ్రీ కొప్పరపు సుబ్బారావు గారు.ప్రజలందరూ మహాసంతోషంతో,ఆనందం
తో జయ జయ నినాదాలు చేశారుట.అందుకే ఆయన గురించి తెలియని అప్పటి సినీమా ఆర్టిస్టులు.శ్రీ ఎన్టీఆర్ గారు మొదటి సారిగా సినిమారంగంలోకి అడుగు పెట్టడానికి కారణం మా మామగారు రచించిన నాటిక "చేసిన పాపం" ను చూసి ఆయనను తెలుగు వారు మరిచిపోలేని నటుడు,నాయకుడు అయ్యారు.శ్రీమతి రావు బాల సరస్వతి గారిని పరిచయం చేసింది కూడా మా మామగారే, శ్రీ గుమ్మడి గారు,వాచస్పతి జగ్గయ్య గారు,మురళీ మోహన్ గారు,శ్రీ మిక్కిలినేని గారు,ఇంకా ఎంతోమంది సినీప్రముఖులు అందరూ ఈయన నాటకాలలో నటులే.అందరికీ పరిచయము
అందరితో స్నేహం భావమున్న మహా మహులు మా మామగారు శ్రీ కొప్పరపు సుబ్బారావు.అటువంటి మహామనీషికి కోడలు అనే అవకాశం దక్కినందుకు చాలా చాలా గర్వపడుతున్నాను,(అహంభావం కాదు) ఆత్మీయత.

కామెంట్‌లు