బాల పంచపది--------------------1. కలహం అశాంతి కారకము!రామ రావణ కలహము !రావణ జీవన పతనము!బంగారు లంక నాశనము!కలహం విశ్వాన ,అశాంతి మూలము రామా!2. కురుక్షేత్రాన సంగ్రామము!మిగిల్చే ఇరుపక్షాల విలాపము!అక్షోహిణీలసైన్యము హతము!ధారుణి సమస్తము రక్తసిక్తము!కలహం విశ్వాన ,అశాంతి మూలము రామా!3. నాటి ప్రపంచ యుద్ధాలు!ఈరష్యాఉక్రెయిన్ పోరాటాలు!యుద్ధాలుఆరని దావానలాలు!మానవనిర్మూలన త్రినేత్రాలు!కలహం విశ్వాన,అశాంతి మూలం రామా!4. మనం కత్తి వైరం కాల్చాలి!మనం దేశాన్ని ప్రేమించాలి!మంచిని నిత్యం పెంచాలి!మానవత్వాన్ని బతికించాలి!కలహం విశ్వాన ,అశాంతి మూలం, రామా!5.మనం కలహాలు కట్టి పెట్టాలి!మనం స్నేహాలు జట్టు కట్టాలి !మనం ప్రేమలు పంచి పెట్టాలి !మనం ద్వేషాలు మట్టుపెట్టాలి!కలహం విశ్వాన,అశాంతి మూలం ,రామా!6. కలహ భావన ఫలం వేదన!గెలిచినా ఓడినా రోదన!విశ్వ పౌరులమన్న యోచన!శాంతి మానవ జీవన సాధన!విశ్వాన కలహం,అశాంతి మూలం, రామా!_________
అశాంతి మూలం!;-డా.పి.వి .ఎల్ .సుబ్బారావు, 9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి