సుభాషితం అనగా మంచి మాట
పెద్దలు నడివెదురు చక్కని పలుకులు
ప్రతి ఒక్కరూ ఆచరించాలి మనసు నిలిపి
మహనీయమైన వాక్కు మదిని శాశ్వతము!!
సూక్ష్మము సిట్టిమెత్తని సున్నిత భావసరళితో
హృదయపు అంచుల లోతుల మమతలని
తట్టి కదిలించి వెలుగు నింపి బ్రతుక నేర్పేది
ఆచరించ అద్భుతం, వీనులకు విందు!!!
అనుభవించ బాధ్యతాయుత అక్షర
లిఖిత శాసనాలు మన సంపదలు
. అనుభవించి ఆచరించ చూపేవే
సుభాషితాలు భర్తృహరి సుభాషితాలు!!!
ఎంతో ప్రఖ్యాతి గాంచినవి, దివిరి
ఇసుమున తైలంబు తీయవచ్చు
అతి కష్టంతో ఇసుకనుండి నూనె
తీయవచ్చు ఎండమావిలో నీరు
తాగవచ్చు, కుందేటి కొమ్ము
సాధించవచ్చు, ఎంతైనను
మూర్ఖుల మనసు సంతోష పెట్టలేము!!
ఉత్తములు ఎంత సంపద ఉన్నా
గర్వించరు మంచి వినయ విధేయతలతో
మెలుగుతారు, మంచి మాట జీవితం ఇస్తే
మంచి మనసు మానవత్వం పంచుతుంది
సూక్తులు మానవ జీవన సరళిని
మార్చు మహా అద్భుత శక్తులు
ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి