మంచి చేయబోతే;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మానవ జీవితంలో సృష్టికర్త బ్రహ్మ  ఈ ప్రపంచంలో మానవజాతిని సృష్టించింది  వారేనని అందరి నమ్మకం  వారి నోటి యందు భార్యకు సరస్వతీదేవికి స్థానం ఇచ్చి గౌరవించినవాడు  సరస్వతి దేవి వాక్కునకు మూలం  మాట అన్నది ఎంత పవిత్రమైనదో దాని విలువ ఏమిటో  ఎంతమందికి తెలుస్తుంది  మౌనం వహించేవాళ్లు ఎంతమంది ఉన్నారు కనీసం వారి అవసరాలను తీర్చుకోవడానికైనా మాట్లాడాలి కదా. అలాంటివారు ఒక రకమైతే  ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే అంతవరకు ఏదో ఒకటి  తెలిసినా, తెలియకపోయినా మాట్లాడుతూ ఉండడం  కొంతమందికి సరదా  చాలా గొప్పగా మాట్లాడాను అనుకునే వారు కొంతమంది అయితే  నీచంగా మాట్లాడుకునేవారు కొంతమంది. నీచ తత్త్వం కలిగినటువంటి వారు ఎలాంటి మాటలు మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు.
అలాంటి వారిని సరి చేయడం కోసం  అలా మాట్లాడితే ఎదుటి వాళ్ళు బాధపడతారయ్యా మామూలుగా సభ్యత సంస్కారం తెలిసి మాట్లాడితే ఎదుటివారు కూడా  ఆనందంగా ఉంటారు అలా చేయడానికి ప్రయత్నించకూడదా అని చెప్పిన వాడిని చాలు చాలు లేవయ్యా చెప్పొచ్చావు  మాటలు కూడా నీ దగ్గర నేర్చుకోవాల్సిన స్థితి ఉందా నాకు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి సలహాలు ఇవ్వవద్దు అని  అతనిని కూడా తిట్టి గెంటి వేసే పరిస్థితి వస్తుంది.  అందుకే నా పుత్ర సముడు  నిత్యం అమ్మవారి సేవలో గడిపేవాడు ఎప్పుడు మాకు చెప్పే హితమైన మాట  ఎవరైనా సలహాలు అడిగినప్పుడే చెప్పాలి తప్ప  అనవసరంగా కలగజేసుకుని మాట్లాడవద్దు. ఎక్కడకు వెళ్ళవలసి వచ్చినా ఆహ్వానము లేకుండా వెళ్ళవద్దు అని. జీవితంలో ఎంత ఆచరించ తగిన మాటలు అవి. ఇలాంటి వారికి బుద్ధి చెప్పడానికి వెళ్ళినప్పుడు వారు చెప్పిన మాటల అర్థం తెలుసుకుంటాం.
దీనిని వేమనమాధ్యులు  ఎంత అర్థవంతంగా చెప్పారంటే  ఒక రైతు  ముద్దుగా చూసుకునే గిత్తలను  పోషించడానికి ఎండు గడ్డితో పాటు పచ్చగడ్డి కూడా వేసి  చక్కగా మేపుతూ ఉండగా,  ఆ దూడకు దోమలు కుడుతున్నప్పుడు  దానిని  తీసివేసి  ఆ స్థలాన్ని  రుద్దుతూ ఉంటే, మంచి చేయబోయిన  యజమానిని  చక్కటి పచ్చటి గడ్డిని వేసి సాకుతున్న  వ్యక్తిని  కొమ్ము విసిరి  అతనికి గాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కనుక  మంచి చేయబోతే  చెడు ఎదురైనట్లు  అని పెద్దలు ఊరకనే చెప్పలేదు కనుకనే ప్రతి క్షణం గుర్తుకు వచ్చేది పెద్దలు చెప్పిన మాట చద్ది మూట అన్న వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే  ఇలాంటి మూర్ఖుల నీచుల చేత అనవసరమైన మాటలు పడవలసిన అవసరం ఉండదు  అని అద్భుతంగా చెప్పాడు వేమన  ఆ పద్యం ఒకసారి చదవండి.

"తనదు బాగుగోరి ధర్మంబుజెప్పిన
దిట్టు చుండు నధముడెట్ట యెదుట  
గడ్డి వేయ పోట్ల గొడ్డు కొమ్మాడించు..."


కామెంట్‌లు