రానిది రాదు పోనిదిపోదు అని ఎంతో గొప్ప వేదాంత అర్థంలో భక్తి భావంతో వ్రాసిన త్యాగరాజ స్వామి కీర్తన ఎంత తన్మయత్వం పొంది వ్రాసి ఉంటాడు రామనామ శబ్దం తప్ప మరొక నామానికి వెళ్లలేదు కనుకనే ఆ రామయ్య త్యాగయ్యలో ప్రవేశించి తానే త్యాగరాజ స్వామిగా పలికిన కీర్తన మానవుని జీవితం విచిత్రంగా ఉంటుంది కొందరు ఆశ బో తులు ఉంటారు కొందరు అత్యాశతో చేయరానివి, చేయకూడని ఎన్నో దుష్కార్యాలను చేస్తూ ఉంటారు. ఆ గుణాలు వేరువేరుగా ఉన్నవి ఎలా వారికి అలవాటు పడ్డాయో మానసిక విశ్లేషకులు కానీ చెప్పలేరు తల్లిదండ్రుల పెంపకం వల్ల కూడా అలా జరగవచ్చు అనేది ఒక వాదము ఏది ఏమైనా ఈ సమాజం భిన్న భిన్న అభిప్రాయాలతో కూడినది ఒకరిది మంచి కావచ్చు అతనికి మంచిదైనది ఎదుటి వారికి చెడు కావచ్చు. కనుక ఏ వ్యక్తి ఆలోచన సరైనది అని నిర్ణయించడం కష్టం.
నాకు ఇది అవసరం లేదు దానికోసం నేను పోరాడను అంటూ భీష్మించుకు కూర్చున్న వ్యక్తికి అదే రావడం ఆశ్చర్యంగా ఉంటుంది మరొక వ్యక్తి ఇది నాకు కావాలి దానికోసం ఎంతకైనా తెగిస్తాను ఎంత కష్టమైనా సాధిస్తాను అన్న పట్టుదలతో ఎంతో కృషిచేసి దాని మీదే మనసును లగ్నం చేసిన వ్యక్తికి అది జరగదు మానవుడు దేనిని కావాలని ఆశిస్తాడో ప్రకృతి లేదా భగవత్ స్వరూపం దానికి విరుద్ధంగా ఫలితాలు వచ్చేలా చేస్తుంది ఇది నమ్మకము కావచ్చు మూఢనమ్మకం కావచ్చు కానీ అలా జరిగిన సంఘటనలు అనేకం మనకు తెలుసు తెలిసిన తర్వాత కూడా దానిని నమ్మక పోయినట్లయితే పెద్దలు చెప్పిన నా నుడి ఎందుకూ పనికిరాదనిపిస్తుంది. పెద్దలు చెప్పినది తప్పకుండా జరిగి తీరుతుంది అని ప్రతి ఒక్కరూ నమ్ముతారు.
దానికి ఏమని సమాధానం చెప్తాము. నేను ఈ దానం చేశాను నాకు ఫలితం లేకపోయింది గొప్ప మేలు జరుగుతుందనుకున్నాను జరగలేదు లాంటి ఆలోచనలతో మనసును గాయం చేసుకుంటూ ఉంటాడు మానవుడు అలాంటి మానసిక క్లేశాలకు వెళ్లకుండా భవిష్యత్తు మీద భారం వేసి తాను ఏది చేయాలని అనుకున్నాడో దానిని చేసినట్లయితే దానికి తగిన ఫలితం వస్తుంది తప్ప ఆలోచనలతో మనసును పాడు చూసుకుంటే శారీరకంగా రుగ్మతలు రావడం తప్ప ఫలితం ఉండదు కనుక జీవి జీవించడం కోసం అత్యాశకు పోయి పేరాశగా ఆలోచించడం కాకుండా భవిష్యత్తు మీద భారం వేసి వర్తమానాన్ని ప్రశాంతంగా నీవు చేయవలసిన, చేయదలచిన పనులతో ముందుకు ప్రయాణం చెయ్ అని చెప్తున్నారు వేమన. ఆ పద్యాన్ని ఒక్కసారి చదవండి.
"వద్దనంగా పోదు వలె ననగా రాదు
తాను చేసినట్టి దాన ఫలము ఉల్ల మందు వగవకుండుటే యోగంబు..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి