ఈ ప్రపంచంలో మనం కొంతమందిని చూస్తూ ఉంటాం జీవితంలో ఏదో సాధించాలి పరలోక ప్రాప్తి కోసం మోక్షం సంపాదించడం కోసం ఏదో ప్రయత్నం చేయాలి అన్న సంకల్పంతో వారిని వీరిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా చెప్తారు మీరు ఫలానా స్వామి వద్దకు వెళితే నీకు కావలసిన అన్ని విషయాలు ఆయన నీకు అర్థం అయ్యే స్థితిలో చెప్తాడు అక్కడికి వెళ్లి వారి ఆశీస్సులు పొందితే నీవు త్వరగా మోక్షాన్ని పొందవచ్చును అని సలహాలను ఇస్తూ ఉంటారు. అందరు చెప్పిన సలహాలను విని తనకు దగ్గరగా ఉన్న స్వామీజీ దగ్గరకు వెళ్లి వారు చెప్పినది విని ఏ అక్షరం అర్థం కాకుండా తాను ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో మళ్లీ తిరిగి తన ప్రాంతానికి వస్తాడు మళ్లీ అదే ప్రయత్నం ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన ఫలితం మాత్రం శూన్యం.ప్రపంచానికి ఆధ్యాత్మికతను తెలియజేసిన ప్రపంచానికి భారతదేశ చరిత్రను చాటిన మహానుభావుడు వివేకానంద స్వామి. తన చదువు మధ్యలో ముగించి కుటుంబ బాధ్యతలను నెరవేర్చలేని స్థితిలో కాషాయం కట్టిన ప్రతి వాడిని ఆపి తన బాధలను తెలియజేసి వారి పాదాలకు నమస్కరించి నాకు మోక్ష మార్గాన్ని ప్రసాదించమని కోరినప్పుడు ఒక సాధువు చెప్పిన విషయం మేమంతా ఈ కాషాయాన్ని ధరించింది కడుపు నింపుకోవడానికి వేసిన వేషం తప్ప భగవాన్ నామ స్మరణ చేస్తూ వారిని చేరుకోవాలనే తపనతో యోగ సిద్ధి కోసం తపస్సు చేసేవాళ్ళం కాదు నీకు యోగమార్గం కావాలంటే ఆ ప్రక్కన కాళీమాతను తన కన్నతల్లిగా పూజిస్తున్న రామకృష్ణ పరమహంస పాదాలను ఆశ్రయించు అని సలహా ఇచ్చారు. అక్కడికి వెళ్లి అమ్మవారిని నీవు చూశావా అని అడిగినప్పుడు పరమహంస చెప్పిన సమాధానం. నేను నీతో ఎలా మాట్లాడుతున్నానో నిన్ను ఎలా చూస్తున్నానో అమ్మవారిని అలాగే చూస్తూ మాట్లాడుతున్నాను అంటే నాకు ఆ అమ్మ దర్శనం ఇప్పించగలరా అని అడిగిన మరుక్షణం తన బలాన్నంత ఉపయోగించి చెంప పగలగొట్టారు. క్షణం పాటు అంతా చీకటి ఏమీ తెలియలేదు తేరుకొని అదేమిటి స్వామి అని అడిగితే ఇప్పుడు నీకు ఎలా ఉంది నేను కొట్టినప్పుడు అని అడిగితే అంతా గాఢాంధకారంలో ఉంది నాకేమీ తెలియలేదు అని సమాధానం ఆ చీకటిలో వెతుకు నీకు వెలుగు కనిపిస్తుంది అదే భగవత్ స్వరూపం అని జ్ఞానబోధ చేశారు అలాంటి గురువులు ఎంతమందికి దొరుకుతారు ఈ మానవులలో కొంగ జపం చేస్తూ కూర్చుంటే మోక్షం సిద్ధిస్తుందా అని ఎద్దేవా చేస్తారు వేమన ఆ పద్యం మీరూ చదవండి.
"అందు నిందు వెదకి యనుభవమందక కొందరయ్యలెపుడు కొంగ వలెను మూర్ఖ తపము భూని మురియుట గానరో..."
"అందు నిందు వెదకి యనుభవమందక కొందరయ్యలెపుడు కొంగ వలెను మూర్ఖ తపము భూని మురియుట గానరో..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి