దుఃఖమే కారణం;-ఏ.బి ఆనంద్ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మానవుడు ఆశాజీవి  జీవించాలన్న ఆశ లేకపోయినట్లయితే ప్రతిక్షణం ఆత్మహత్య చేసుకునే  ఆలోచనలో ఉంటాడు. నేటి కన్నా రేపు ఇంకా బాగుంటుంది  దానికోసం ఇవాళ మనం చేసిన దానికన్నా మరింత కష్టపడి  మరింత సముపార్జన చేసినట్లయితే  కుటుంబాన్ని  సుఖంగా గడపవచ్చు అనుకుంటాడు  దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు  స్వయంకృషిని నమ్మి  తాను సంపాదించి తినాలని కోరిక, కోరికలన్నిటిలోనూ గొప్ప కోరిక. మామూలుగా మనిషికి సహజ సిద్ధంగా ఉన్న  ఆశ  కొంచెం పెరిగి  పేరాశగా మారి  ఇంకొంచెం పెరిగి దురాశ రూపాన్ని తెచ్చుకుంటుంది ఆ స్థితికి వచ్చిన వ్యక్తి ఏది చేయడానికైనా సిద్ధంగానే ఉంటాడు  ప్రాణం మీద తీపి ఉండదు  ఎదుటివారిని చంపడానికి కూడా సిద్ధపడతాడు. అలాంటి దురాశను మొక్కలోనే తుంచి వేయాలి. మన పెద్దలు చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే  ఏ మనిషికైనా ముందు  కోరిక వస్తుంది  ఆ కోరిక ముదిరి  అనుకున్నది తీరకపోతే రోషం  పెరుగుతుంది.  దాన్ని అంటిపెట్టుకున్నదే మదం. మదం ఎప్పుడు పెరిగిందో  మాత్సర్యానికి కళ్ళు తెరుచుకుంటాయి. దీనితో లోభానికి కళ్ళు కుట్టి వీరందరికీ  ఉన్నది నాకు లేదా  వాడి కన్నా నేను దేనిలో తక్కువ  అన్న ఆశతో కోరిక పెరుగుతుంది. ఇవన్నీ ఎప్పుడైతే మానవులలో పెరిగాయి  వీటిని అరిషడ్ వర్గాలు అంటారు ఏదైనా ఒక్క వర్గం ఉంటే ఆ మనిషి జీవితం సర్వనాశనం అవుతుంది. అలాంటిది ఆరు గుణాలు కలిసి ఒకరిలోనే ఉన్నప్పుడు ఏమవుతుంది  దానికి హద్దులు ఉంటాయా ఏం చేయాలో, ఎలా చేయాలో కూడా తెలియని దుస్థితికి వస్తాడు  కళ్ళు మూసుకుపోయి  చేయరాని అకృత్యాలు అన్నిటినీ చేస్తాడు.
దీనివల్ల విపరీతమైన దుఃఖానికి  లోనవుతాడు కనుక వేమన మానవాళికిస్తున్న సలహా ముందు చూపును సరి చేసుకో  ఏదైనా వస్తువును చూసినప్పుడు కదా అది నా సొంతం కావాలని ఏ వ్యక్తి అయినా ఆశించడం సహజం. ఎప్పుడైతే చూపు దాని మీద పడి  తన సొంతం కావాలి అనుకున్నాడో దాని ప్రభావం మనసు మీద ఉంటుంది. అది పొందడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేయాలో అన్ని విధానలు ఈ తనువుకి చెబుతుంది మనసు. చెప్పినది సరైనదే అనుకుంటాడు వాడు పిచ్చివాడు. ఎప్పుడైతే ఆ మనసును స్వాధీనం చేసుకుని పరి పరి విధాల ఆలోచించకుండా ఉండేలా కట్టుదిట్టం చేసుకుంటాడో అప్పుడు ఈ లోకంలో అతనిని  మించిన మంచి వ్యక్తి మరొకరు ఉండరు. వేమన చెప్పినట్లు వారు ముక్తిని పొందినంత  ఫలితాన్ని పొందుతారు  అంటాడు  మరి ఆ పద్యం చదవండి.
"ఆశ కన్న దుఃఖ మతిశయంబుగ లేదు  
చూపు నిలుపకున్న సుఖము లేదు  
మనసు నిలుపకున్న మరి ముక్తి లేదయా..."


కామెంట్‌లు