భారతదేశంలో జన్మించిన బుద్ధ దేవుని నుంచి నిన్న మొన్నటి మహాత్మా గాంధీ వరకు ప్రతి ఒక్కరూ జీవహింసను గురించి మాట్లాడిన వారే. రామాయణంలో రాతి యుగంలో ఉన్న మనుషులకు నీవు బ్రతుకుతున్నట్లే ఆ జీవులు కూడా సంచరిస్తూ తమ ఆహారాన్ని తామే సంపాదించుకుంటూ జీవనం కొనసాగిస్తున్న దానిని చంపే అవసరం నీకు ఏముంది హాయిగా ప్రకృతి మనకిచ్చిన అడవులలోనికి వెళ్లి ఆకులలములు తిని కందమూలాలతో కడుపునింపుకునే వనరులు ఉండగా ఇలాంటి పనులు చేయవద్దు అని హెచ్చరిస్తూ రామాయణం ఉద్ గ్రంథంగా మన ముందు ఉంచారు ఆదికవి వాల్మీకి మహర్షి వారు చెప్పిన ప్రతి అక్షరం శిరోధార్యమే కదా దానికి భిన్నంగా ప్రవర్తించినవాడు ఎవరైనా శాంతియుతంగా జీవించగలరా అని ప్రశ్నించుకుంటే వాటి జోలికి వెళ్లడం మానుకుంటారు.
సమాజంలో రకరకాల వ్యక్తిత్వాలు వున్న వ్యక్తుల మధ్య మనం జీవిస్తున్నాం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. సాత్వికులు ఉన్నారు తమసులో ఉన్నారు వున్నారు ఎవరి పద్ధతిలో వారు తమ కడుపులను నింపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ధర్మాన్ని మాత్రమే పాటించి జీవితాన్ని సుఖంగా కొనసాగిద్దాం ఉన్న దానిలో తృప్తిగా ఉందాం అని భార్యాభర్తలు అనుకుని ఆ కుటుంబాన్ని నడుపుతూ ఉంటారు. పనీపాటా లేకుండా ఏ పనైనా చేసి సంపాదించుకోవాలన్న ఆలోచన కూడా రాకుండా జీవితంపై ఆశలు వదులుకొని కొంతమంది ఏ క్షణానికైనా మనం చనిపోవడమే కదా అన్న అభిప్రాయముతో నీచత్వానికి దిగి రౌడీయిజం పేరుతో ఇతరులను బెదిరించి వారి ధనాన్ని అపహరించి జీవితాన్ని విలాసవంతంగా గడుపుతారు ఇది జగతిలో మనం చూస్తున్న నిజం.
సాత్విక జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి అలాంటి వ్యక్తులలో ఉన్న క్రూరత్వాన్ని నీచ తత్వాన్ని, చెడు ఆలోచనలను తొలగించి ఇలా అన్యాయంగా పొట్ట పోసుకోవడం వల్ల సమాజానికి చెడు జరుగుతుంది స్వయంకృషితో జీవిస్తూ ఎదుటివారికి మంచి చేయమని సలహాలనిస్తూ సరళంగా చెప్పినప్పుడు అతను కొంచెమైనా మారుతాడు. ఆ రౌడీ ఇజానికి స్వస్తిపలుకుతాడు దీనిని తేలుతో పోలుస్తూ వేమన అందమైన సిమిలి మనకు అందించారు తేలుకు ఏ విధమైన లాభం లేకపోయినా కనిపించిన ప్రతి వ్యక్తిని కాటు వేస్తుంది వారిని బాధలకు గురిచేస్తుంది తెలివైనవాడు దాని కొండాన్ని తీసి పంపితే అంతకుమించిన సాధు జంతువు మరొకటి ఉంటుందా ఇలాంటి పోలికలను సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చెప్పిన వేమనను ప్రజా కవి అనడంలో అతిశయోక్తి ఏముంది మరి ఆ పద్యం మీరు కూడా చదవండి.
"చంపకూడదెట్టి జంతువునైన చంపవలయు లోక శత్రుగుణము
తేలు కొండి కుట్టె తేలేమి చేయురా..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి