మనం ఉదయం లేచినప్పటి నుంచి నిద్రించే వరకు అనేక రకాల మనస్తత్వాలున్న వ్యక్తులను కలుసుకుంటూ ఉంటాం కొంతమంది వారి వారి పనులు శ్రద్ధగా చేసుకుంటూ తమ కుటుంబ సభ్యులతో హాయిగా కార్యక్రమం చేస్తూ ఉంటారు మరి కొంతమంది తనకు కలిగిన దాంట్లో ఎదుటివారికి కొంచెం సహాయం చేయగలిగితే అవసరంలో ఉన్న వారిని ఆదుకోగలిగితే బావుంటుందన్న అభిప్రాయంలో తమ శక్తి మేర తనకు మిగిలిన వాటితో సహకరిస్తూ ఉంటాడు ప్రత్యేకంగా మరొక రకం ఉంది నిజానికి వారు మధ్యతరగతి కుటుంబీకులై ఉంటారు ఎదుటివారిని చూసి వారి కన్నా విలాసవంతంగా దానధర్మాలకు వీరందరిని మించిన వాడిని నేనే అని అందరూ చెప్పుకునేలా ప్రవర్తించాలని ఆశ పడుతూ ఉంటారు. తన వద్ద ఉన్నా, లేకపోయినా అప్పు తీసుకువచ్చి ఇతరులకు కనిపించేలా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల అతనికి ఎంతో తృప్తి కలగడంతో పాటు మరి కొంతమందిని కూడా ఆకట్టుకోవాలని చూస్తారు ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు మరొక రకం మనుషులు అతని మనస్తత్వాన్ని వ్యాపార వస్తువుగా భావించి దాని ద్వారా వాళ్లు లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తారు ఫలానా వాడు ఫలానా విషయంగా బాధపడుతున్నాడు అతనికి మీరు సహకరిస్తే బాగుంటుందని సలహాలనిస్తూ ఉంటాడు అతను పాపం అది నిజమేనా అని అతనికి కొంత సహాయం చేయడానికి ముందుకు వస్తాడు అతని దగ్గరకు వెళ్లి అతని అవసరం ఏమిటో తెలుసుకొని దానికి తగినట్టుగా ప్రవర్తిస్తారు.
దీనివల్ల అతనికి ఒరిగేది ఏమిటి వాడు నలుగురు ఆహా ఓహో మీ అంత దానశీలురు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండ రండి.ఆనాటి కర్ణుని కన్నా నిన్న మొన్నటి బుడ్డా వేంగళరెడ్డి గారి కన్నా మీరు ఎంతో గొప్ప అని వారు పొగుడుతూ ఉంటే అదంతా నిజమేనన్న భ్రమలో ఎంతో ఉబ్బి తబ్బిబ్బైపోతాడు వారు ఎంత పొగిడితే అంతకుమించి మరి కొంతమందికి సహాయం చేయడానికి ముందుకు వచ్చి తన ఆస్తిపాస్తులను నీటిలా కలిగించుకోవడమే కాక చివరకు తను కూడా ఇతరుల ముందు చేయిచాచ వలసిన దుస్థితి ఏర్పడుతుంది ఇలాంటి వాటికి లోను కావొద్దు అని వేమన తనకు మించిన దానం చేయకుండా ఉన్న దానిలో మీరు జీవిస్తూ మిగతా దానిలో కొంత ఇతరులకు పంచమని కోరుకుంటూ మనకు సలహాలిస్తున్నారు. మరి ఆ ఆటవెలదిని మీరు కూడా ఆస్వాదించండి.
"తన్ను చూసి యొరులు దగ మెచ్చవలెనని సొమ్ము తెరవు బెట్టు నెమ్మి మీద
నొరుల కొరకు తానయుబ్బుచునుండును..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి