నయవంచకులున్న లోకంలో;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సమాజంలో ఉన్న మనుషుల మనస్తత్వాలను అర్థం చేసుకొని  అధ్యయనం చేయడం అంత తేలికైన పని కాదు  ఎంతోమంది మోసగాళ్ల మధ్య నయ వంచనకారుల మధ్య  పొగడ్తలతో లొంగ తీసుకునే వారి మధ్య మనం కాలం గడుపుతున్నాం. సామాన్యంగా ఎవరైనా ఏ ఒక్కరిని త్వరగా అనుమానించరు  దానికి కారణం వారి మంచితనం. నిజంగా అతను మన కన్నా మంచి వాడేనేమో అతని మీద మనం  చెడ్డ అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం మంచిది కాదు  అన్న విచక్షణతోనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వారిని బట్టలో వేసుకోవడం చాలా సులభం. నిజంగా నమ్మినట్లు  అవతల జరిగిన విషయాన్ని కళ్ళకు కట్టినట్లుగా తాను చూసినట్లు మనకు  దృశ్య రూపంలో చూయించినంత అందంగా  మాటల చాతుర్యంలో వారికి వాళ్లే దిట్టలు. ఈ ప్రపంచంలో ఎన్ని హేతువాదాలు ప్రబలినా నాస్తికత్వం ప్రచారం చేస్తూ ఉన్నా మానవ జీవితంలో  తన జీవితాన్ని నడిపించేది  రాముడు కృష్ణుడు అనుకున్న  దేవతలను నమ్మినా నమ్మకపోయినా ఏదో అదృశ్య శక్తి ఉన్నది మనలను నడిపిస్తున్నది అన్నది ప్రతి వాడి నమ్మకం. దానికోసం పూజలు, పునస్కారాలు చేయకుండా మనసులోనే  చేసుకునే వారు కొందరుంటారు  తాను తన కుటుంబం మొత్తం  ఏ చిన్న పండుగ వచ్చినా  ఆ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆ గృహ దేవతను పూజించడం  భక్తిశ్రద్ధలతో ఆ భగవంతుడికి సంబంధించిన  కీర్తనలను ఆలపించడం  భక్తి ప్రపత్తులతో వారి పాదాలను ఆశ్రయించి సాష్టాంగ దండ ప్రణామములు చేయడం మనం చూస్తూనే ఉన్నాం  దాదాపు ఎక్కువ మంది ఇళ్లలో జరిగేది అదే.
పూజ చేసే ప్రక్రియలో ప్రధానంగా చెప్పుకోవలసినది  నమకం చమకం భగవంతుని ఉద్దేశించి అంతటివాడివి, ఇంతటి వాడివి  అలాంటి ఘనకార్యాలు చేశావు ఇలాంటి ఘనకార్యాలు చేశావు అని పొగడ్తలతో ముంచి వేయడం  ఎంత భగవంతుడైనా  పొగడ్తకు లోకువే కదా ఆ తరువాత అతని అసలు స్వరూపం బయటపడుతుంది  నాకు అది ప్రసాదించు ఇది ప్రసాదించు అని కోరుకోవడం స్వార్థంతో  భక్తిని వ్యాపార వస్తువుగా పరిశీలనగా చూడగలిగిన మహత్తు కలిగిన  వాడు కనుక  అతని లోపలి స్వభావానికి లోను కాక  నిశ్చలంగా ఉండిపోతాడు  అలాంటి తుంటరి వాళ్లను  దగా చేసే వారిని దగ్గరకు  తీస్తే చెడ్డ ఫలితాలు తప్ప మంచి ఫలితాలు రావు అని హెచ్చరిస్తున్నాడు వేమన  ఆయన రాసిన ఆటవెలది చదివితే మీకే తెలుస్తుంది ఆ రహస్యం.

"నక్క వినయంబులు నయముగా జేసేటి  నీతి దప్పిన నరుల నమ్మరాదు కాదని నమ్మిన కడ  కష్టమొచ్చురా ..."  కామెంట్‌లు