నాగులపల్లి భాస్కరరావు నేను ఎస్ఆర్ఆర్ కళాశాలకు వచ్చిన 1961 నుంచి పరిచయం నాటి నుంచి నేటి వరకు ఏ పొరపొచ్చాలు లేకుండా ఆత్మీయతను పంచుతూనే ఉన్నాడు భాస్కర్ ఆ పేరు పెట్టడంలో వారి తల్లిదండ్రులు తీసుకున్న శ్రద్ధ నాకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మానవ జీవితానికి మనిషి మనిషిగా నిలబడడానికి మూలస్తంభం పాము మన మాటలకు మూలం మన ఆలోచనలకు ఆలంబన వెన్నుపాము దానిని వెన్నుపూస అని అంటాము. అలాంటి నాగులున్న పల్లెలో జన్మించాడు మా భాస్కర్. ఒక్క వెన్నుపూస 16108 ఆలోచనలను కలుగజేస్తుందని భౌతిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అలాంటిది గ్రామం మొత్తం పాములతో కలిసి ఉన్నప్పుడు ఆ ప్రాంతం ఎంతో పవిత్రమైనది ఎంత ఆలోచనాత్మకు మూలం దానికి తగినట్లు తల్లిదండ్రులు భాస్కర్ అని పెట్టడం ప్రపంచానికి వెలుగునిచ్చి కనిపించే దేవుడు సూర్య భగవానుడు. అలాంటివారి తేజస్సుతో కలకాలం ప్రజాసేవలో ప్రజా జీవితాన్ని కోరుతూ జీవించాలి అనేది వారి తండ్రి ఆశయం కావడం వల్ల ఆ పేరు పెట్టారని నాకనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఏ బిడ్డ భవిష్యత్తు అయినా తల్లిదండ్రుల పెంపకం మీద ఆధారపడి ఉంటుంది ఆ బిడ్డను ఎలా తీర్చిదిద్ద గలుగుతున్నారు అన్నది ముందు వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అమ్మ పేరు సోమిదేవమ్మ గారు ఆవిడని చూసినప్పుడు ఆవిడి తో మాట్లాడినప్పుడు ఆమె చేతి వంట తిన్నప్పుడు తెనాలి రామకృష్ణుడు రాసిన అన్నపూర్ణ పాత్ర జ్ఞాపకం వస్తుంది. కొసరి కొసరి వడ్డించడం ఆమెకి తెలుసు తరువాత మా సోమిదేవమ్మ అమ్మకే తెలుసు. భాస్కర్ చిన్నతనం నుంచి అమ్మ చెప్పుచేతల్లో పెరిగిన వాడు అమ్మ బుద్ధులన్నీ పుణికిపుచ్చుకున్న వాడు. కుల మత వర్గ వర్ణ విచక్షణ లేని అమ్మ మనసు చదివిన వాడు కనుకనే ఈనాటికీ తన స్నేహబంధంలో ఉన్న అతి సన్నిహితుల కులాన్ని కూడా ఆయన అడిగి ఎరగడు. వ్యక్తితో తప్ప కులంతో సంబంధం లేని ఉత్తముడు, కళకళలాడుతూ స్నేహితుల స్నేహమే కాదు మైత్రి మనసులు కలిసి ఎన్నో సామూహిక కార్యక్రమాలు చేసిన వాళ్ళ వలె మిగిలిపోయాం. స్నేహం జారిపోయేది మైత్రి శాశ్వతం.
సమాజ మార్పు కోసం మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఆపోసన పట్టి వారి శిష్యరికంలో పెరిగిన గోరా అంటే గోపరాజు రామచంద్రరావు గారు వీరి గ్రామం ముదునూరు లో పది సంవత్సరాలు ఉన్నారు వారు సిద్ధాంతాలకు కట్టుబడినవారు. వారిని అతి సన్నిహితంగా చూసింది అమ్మ. కుటుంబం మొత్తం ఆత్మీయంగా కలిసిమెలిసి మెలిగారు అలాంటివారి సాంగత్యంతో ఆ పల్లెటూరిలో సంస్కారం ఉన్న అమ్మగా అందరి చేత జేజేలు పలికించుకున్న అమ్మ శాశ్వతంగా వుంది. వుంటుంది. అందరి మనసుల్లోను ఉంది. ఉంటుంది. అలాంటి అమ్మను పొందిన భాస్కర్ ఎలాంటి మనసు కలిగి ఉంటాడో మనం ఊహించుకోవచ్చు. ఆమె ఉగ్గుపాలతో నేర్పిన సంస్కారం సంస్కృతి జన్మనిచ్చిన గడ్డపై పంచుకున్న మమకారం అందరితో కలిసి జీవించాలని ఆలోచన స్వపర భేదాలు లేకుండా అందరూ నావారే అన్న భావం. ఆత్మీయత అనురాగాలను పంచడం అన్ని అమ్మ నుంచి సంక్రమించిన ఆశీస్సులు, ఆస్తులు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి