ఆశే కారణం;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 జీవితంలో ఏ మనిషికైనా  ఏదైనా ఉచితంగా వస్తుంది అంటే  దాని వెంట పరిగెట్టడం అలవాటు  ఈ రెండు వస్తువులు కొంటే మూడో వస్తువు  ఉచితంగా ఇస్తామని  ప్రకటన చేస్తే. ఆ వస్తువు ఆఘమేఘాల మీద అమ్ముడైపోతుంది. మానవులలో ఉన్న ఆ బలహీనతను అర్థం చేసుకొని  దానిని వ్యాపార వస్తువుగా మార్చుకున్నట్లయితే  ఆ వ్యాపారి ఆర్థిక సంపద పెరుగుతుంది. ఉచితంగా ఇస్తానని ప్రకటించిన ఆ వ్యాపారి  నష్టాల కోసం వ్యాపారం చేస్తున్నాడా?  ఆ మూడు విపణిలో అమ్మితే ఎంత ధర వస్తుందో దానికి సంబంధించిన లాభము కూడా వేసుకొని ఆ మూటి ధరను ఈ రెంటి మీద సర్ది దానిని ప్రకటన రూపంలో వెలువరిస్తే క్షణాలలో అయిపోతాయి. దీనికి కారణాలు వెతకడానికి ప్రయత్నం చేస్తే  ఇలా నాలుగు చోట్ల తిరిగి  ప్రతి చోట మనం  మోసానికి గురి అవుతూ  నష్టపోవడం అనేది  మన ఆశ వల్ల తప్ప  వారు పెట్టిన ఆకర్షణలకు లోనై మాత్రం కాదు  ఏ కొంచెం ఆలోచనా శక్తి ఉన్నా వారి మోసాన్ని గ్రహించలేమా?  గ్రహించి కూడా వెళ్లి ఆ మోసంలో చిక్కుకున్నామంటే  సాలిగూటి లో చిక్కుకున్న  క్రిమిలా ఇబ్బంది పడడమే  ఇలా తిరిగి తిరిగి  నష్టపోవడానికి అసలు కారణం  ఆశ.దానితో నాలుగు చోట్ల తిరిగి నలుగురి చేత మోసపోవడం జరుగుతోంది అని ఎప్పుడు తెలుస్తుంది  దానిమీద మనసు పెట్టి ఆలోచించినప్పుడు మాత్రమే  లోగుట్టు అర్థం చేసుకోగలం  అప్పుడు తెలిస్తే ఏం వస్తుంది ఇలాంటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు  దీనివల్ల చెడు తప్ప మంచి జరగదు అన్న విషయం తెలుస్తుంది. దినినే

 వేమన చక్కటి ఉదాహరణతో  మనకు జ్ఞానోదయం కలిగిస్తున్నాడు.మురికి నీరు ఒకచోట మనం పెట్టినట్లయితే  ఆ నీటి జోలికి మానవమాత్రుడు ఎవరు వెళ్ళరు కదా. మరి ఎవరు వెళుతున్నారు  ఈగలు విపరీతంగా ముసురుకుంటాయి  ఆ చిన్న ఈగ మనకు జ్ఞానాన్ని తెలియజేస్తుంది అన్న పరమార్ధాన్ని గ్రహించలేక  ఆశ వల్ల జీవితంలో మోసపు  పనులకు గురి అవుతున్నాం  ఆ మోసాల నుంచి మనం బయటపడితే తప్ప మన జీవితాలకు వెలుగు లేదు అని హెచ్చరిక చేస్తున్నాడు వేమన  జీవితంలో ఎన్ని అనుభవాలు పొందిన తరువాత  సామాన్య ప్రజల కోసం వారి భాషలో వారికి అర్థమయ్యే పద్ధతిలో ఆట వెలదిని ఎంచి  మనకు బోధిస్తున్నాడు వేమన  ఆ పద్యాన్ని ఒకసారి చదవండి.
"ఆశ చేత మనుజులాయువు గలనాళ్ళు తిరుగుచుందురు భ్రమ తిప్పుదాక మురికి భాండమందు ముసురు నీగల  భంగి"కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం