అతి అభీష్టం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మనిషిని చీకాకు పరిచే  ఈగలను దోమలను చూసి  అసహ్యించుకుంటాం  పాములు తేలును చూసి భయపడతాం. మనకు దోమలు ఉన్నాయి  శరీరంలో ఏ స్థానం దానికి దొరికితే అక్కడ కుట్టి వెళ్ళిపోతాయి. మనందరికీ తెలిసిన విషయమేంటంటే దోమ కాటు వల్ల మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వస్తాయి అని అయితే దోమకు స్వతహాగా ఆ శక్తి ఉన్నదా అంటే లేదు కదా అయితే అది ఎలా వస్తుంది మనకు అంటే  అవతల ఆ వ్యాధితో బాధపడుతున్న వారిని ఈ దోమకాటు వేసి  మళ్లీ వచ్చి మనల్ని కాటు వేసినప్పుడు  ఆ రోగి క్రిములు  మనకు వచ్చే  ఆ జబ్బును వ్యాప్తి చేస్తుంది ఈగ కూడా అంతే అది కుట్టడం వల్ల చీకాకే తప్ప ఎలాంటి చెడు ఫలితాలు రావు. అది మనలను కుట్టినందు వల్ల ఎలాంటి ప్రమాదము జరగదు.
మామూలుగా పామును తలుచుకుంటే చాలు  విపరీతమైన భయం వస్తుంది  మరి దానిని చూస్తే  దాని బారి నుంచి తప్పించుకోవడానికి పారిపోవటమేగా శరణ్యం  అయితే అన్ని పాములు  ప్రాణాన్ని తీసే  విష జంతువులు కావు  వాటిలో కొన్ని మాత్రమే అది కుట్టగానే  రక్తంలోకి వెళ్లకుండా గుడ్డ గట్టిగా కట్టి అంతవరకు ఆ విషాన్ని తీసివేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. కొన్ని  కాటు వేసినప్పుడు క్షణాలలో ప్రాణం పోతుంది  ఆ స్థితి నుంచి ఎవరూ కాపాడలేరు  అయితే మానవ ప్రయత్నంలో  వారికి హాని కలిగించే  విష పదార్థం ఏదైతే ఉందో  దానిని పాము కోరల నుంచి తీసివేస్తే  అది ఎన్ని కాటులు వేసినా ఏ విధమైన ప్రమాదము జరగదు అది చేయడానికి ధైర్యం ఉండాలి ధైర్యంగా ఉన్నవాడికి ఆ భయం లేదు రాదు కూడా
తేలును కానీ మండ్రగబ్బ నుగాని చూసినప్పుడు  ఒక రకమైన బెరుకుతో కూడిన  భయం ఏర్పడుతుంది. దాని బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొంచెం  ధైర్యంగా ఉన్నవారు  రాతితో కానీ కర్రతో గాని దానిని చంపడానికి ప్రయత్నం చేసి  కృతకృత్యులయ్యే అవకాశం ఉంది. అయితే కొన్నిసార్లు అది తప్పించుకుని పారిపోయే ప్రమాదం కూడా ఉండవచ్చు.  అది భయంతో ఎంతమందిని కరిస్తే అంత మందిని కాటు వేసి ఉంటుంది. దానిని పట్టుకొని దానికి కోరల్లో ఉన్న విషాన్ని తీసివేయడానికి  ఆ మొత్తం కొండినే తీసివేసినప్పుడు దానిలో విష పదార్థం వుండదు కనుక అది కుట్టినా గాని ఏ విధమైన ప్రమాదం మానవులకు జరగ దు  కనుక మానవులను  హెచ్చరిస్తూ తగిన జాగ్రత్తలో ఉండమని  సలహా ఇస్తున్నారు వేమన ఆ పద్యం మీ సొంతం.

"ఈగ తల విషంబది మూడదు నీలోన 
దేలు తోక విషయము తెంపుజూచు  
పాముకోర విషము బట్టి చంపును గదా..."


కామెంట్‌లు