మనిషిలో ద్వైదీ భావం ఎక్కువగా ఉంటుందని చెబుతూ ఉంటారు మన పెద్దలు. సామాన్యంగా ఏ పని చేయాలని మానవుడు తలచిన తర్వాత చేద్దాం, సందర్భం వచ్చినప్పుడు చూద్దాం అని ఆలోచనలు తప్ప మంచి ఆలోచన వస్తే దానిని వెంటనే చేయాలన్నా చేయలేడు అది బలహీనత. ఒకవేళ ఏదైనా చేయాలని అనుకుని చక్కగా ప్రణాళిక స్పష్టంగా ఆలోచించి దానిని కార్యరూపంలో పెట్టినప్పుడు తప్పకుండా అది మంచి ఫలితాలను ఇస్తుంది. ఎప్పుడైతే ఆ మంచి ఫలితం వచ్చిందో అప్పుడు అతని స్వరూపం బయటపడుతుంది నేను కనక ఇలా చేయగలిగాను మరి ఎవరు ఇలా చేయలేరు అన్న అహం కూడా పెరుగుతుంది ప్రక్కనే ఉన్న సన్నిహిత మిత్రుడు కాలం కలిసి వచ్చింది కనుక అది చేయగలిగావు అంటే కాలం లేదు, ఏమీ లేదు. దేవుడు లేదు, దయ్యం లేదు ఈ ప్రపంచంలో నా కార్యదీక్ష తప్ప మరొకటి లేదు అని విర్రవీగుతాడు.భారతీయులలో ఉన్న ఈ తత్వం పాశ్చాత్య దేశాలలో కూడా ఉంది అందుకే షేక్స్పియర్ టు డు ఆర్ నాట్ టు డు అని డోలాయమానంగా చెబుతాడు. అంటే స్థిరమైన చిత్తంతో దీనిని తప్పకుండా చేయాలి అన్న దృష్టి చాలామందికి ఉండదు నిర్లిప్తత తరువాత చేద్దాములే అన్న బద్ధకం ఆ పనిని పూర్తిగా చేయనివ్వదు అందుకే జీవితాన్ని నడుస్తున్న నీడలా వర్ణించాడు. జాన్ మిల్టన్ మహాశయుడు కూడా సముద్రంలో రెండు దుంగలు ఒక్క క్షణం కలిసి విడిపోయినటువంటిది ఈ జీవితం అన్నాడు కనుక మానవ ప్రకృతి ఎక్కడ ఏ దేశంలో ఎలా ఉన్నా ఒకే విధంగా పని చేస్తుంది అనేది వేమన నమ్మకం. పిల్లలకు అర్థమయ్యేలా చెబితే వారి జీవితం బంగారు బాటలో పయనిస్తుంది. లేకుంటే ఎప్పుడు ఆలోచనలలో పడడమే తప్ప నిర్ణయాత్మక శక్తి లోపిస్తుంది. ఒకవేళ మనిషి ఇది తప్పకుండా నేను చేయగలను అనుకుని ప్రారంభించి అది మధ్యలోనే చేయలేక ఆగిపోతే భగవంతుడు నాకెందుకు ఇన్ని అగచాట్లు కల్పిస్తున్నాడు ఎవరికీ లేని అవరోధాలన్నీ నాకే వస్తున్నాయి అని బాధపడుతున్నప్పుడు ఆత్మీయుడు వచ్చి ధైర్యం చెప్పి చేయడానికి పురి కొల్పి చేయించిన ఆ పనిలో విజయాన్ని సాధించలేక వెల్లికలా పడిపోయి భగవంతుని నిందిస్తూ కూర్చుంటాడు. నా పైన భగవంతుడు కరుణ చూపిస్తే నాకు ఇలా జరుగుతుందా అనుకుంటాడు కనుకనే వేమన ఈ పద్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చేశాను కదా అని తనను తాను పొగుడుకోవడం అపజయం కలిగినప్పుడు భగవంతుడు ఇలా చేశాడని నిందించడం ఈ రెండూ కూడా మనిషి తత్వానికి పనికిరావు. కాలానికి తల వొగ్గి జీవించడమే మానవ పరిస్థితి అని చెప్తున్నాడు వేమన ఆ పద్యాన్ని మీరు చదవండి.
"చేటు వచ్చెనేని చెడునాడు దైవంబు
మేలు వచ్చెనేని మెచ్చుదన్ను చేటు మేలు దళపతి చేసిన కర్మములు..."
"చేటు వచ్చెనేని చెడునాడు దైవంబు
మేలు వచ్చెనేని మెచ్చుదన్ను చేటు మేలు దళపతి చేసిన కర్మములు..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి