పుస్తక జ్ఞానం వేరు అనుభవ జ్ఞానం వేరు. దేశ విదేశాలలో ఉన్న అనేక మంది పండితులు, అనేక విషయాలను చదివిన మేధావులు అలా చేయాలి, ఇలా చేయాలి ఇది చేయడం వల్ల ఇటు శరీరానికి అటు సమాజానికి మంచి జరుగుతుంది వేరే విధంగా చేస్తే ఇతరులకు హాని కలుగుతుంది తప్ప మంచి జరగడానికి అవకాశం లేదు అని భారతీయుల్లో కాళిదాసు మొదలుకొని వేమన వరకు అందరూ చెప్పిన మాటలను మనకు వినిపిస్తాయి. ఇతర దేశీయులైన షేక్స్పియర్ లాంటివారి ఎన్నో పోలికలను చెబుతూ అద్భుతమైన రచన చేశాడు. వాటిని వల్లె వేసి ఇతరులకు చెప్పడంలో ఉన్న శ్రద్ధ ఈ చెప్పిన దానిని మనం ఆచరిస్తున్నామా లేదా అని ఒక్కసారి తనను తాను విమర్శించకుంటే చేస్తున్నాను అని నమ్మకం కలిగినప్పుడు ఇతరులతో చెప్పడం సమంజసం. అలా కాకుండా పాఠం అప్పజెప్పినట్లు చెప్పితే ఎదుటివారికి ఎలా ఉంటుంది.
జటిలమైన విషయాలను సామాన్యులకు అర్థమయ్యే పద్ధతిలో వివరించి చెప్పడం మేధావుల పని వారికి ఆ విషయం పరిపూర్ణంగా ఎదుటివారు ఏ ప్రశ్న వేసినా దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. అది వినే వ్యక్తి ఇలా చేస్తే చాలా బాగుంటుంది అన్న నిర్ణయాన్ని తీసుకునే విధంగా వారి బోధలు ఉంటాయి. కొంతమంది అన్నీ తెలుసును అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నీ తెలిసినట్లుగానే మాట్లాడుతూ ఉంటారు చెప్పడానికి, తెలుసుకోవడానికి ఎంత భేదం ఉంది ఏదో పాఠం చదివినట్లు చదివింది చదివినట్టుగా అప్పజెప్పినట్లు చెప్పడం కాదు కావలసినది దాని మూలాలు తెలుసుకొని అన్ని కోణాలలోనూ తెలియాలి ఇతను చెప్పిన దాని గురించి ఎదుటివారు ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పగలిగిన స్థితిలో అతను ఉండాలి అప్పుడు మాత్రమే చెప్పాలి తప్ప డబ్బాలు కొడితే దొరికిపోతాడు. యుద్ధానికి వెళ్ళిన సైనికుడు యుద్ధ నైపుణ్యం తెలిసి ఉండాలి వ్యూహాలు పన్ని ఎదుటివారిని ఎలా చంపాలో తెలిసి ఉండాలి అలాగే ఎదుటివారు పన్నిన వ్యూహాన్ని ఎలా చేదించి అతనిని ఎలా మట్టి కరిపించాలో తెలియాలి మామూలుగా మనం చూస్తున్నది అది కొద్దిమందిని వాళ్లని గురించి వాళ్లు ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. మనవాడు యుద్ధంలో ఏం చేశాడు, అదే నేనయితే చిత్రవ్యూహాలు పన్ని వారి తలలు నరికి ఉండే వాణ్ణి అని ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. నిజానికి అతని చేతికి కత్తిని ఇచ్చి యుద్ధం చేయరా అంటే అతని బండారం బయటపడుతుంది. మాటల మనిషి తప్ప చేతల మనిషి కాదు అని తెలిసిపోతుంది. ఇలాంటివారిని చులకన చేస్తూ వేమన రాసిన పద్యం. ఇలాంటి వారిని గురించి ఎన్ని కథలు విని ఉంటాడు వేమన అందుకే మీరు చదవండి.
"మాటలాడవచ్చు మనసు నిల్పగ రాదు
తెలుపవచ్చుదాని దెలియలేరు సురియ బట్ట వచ్చు సురుడు గారాదు..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి