మానవ ప్రయత్నం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 జీవితంలో ఏది సాధించాలన్నా దానికి తగిన మూలాలు తెలుసుకొని  స్వయంకృషితో దానిని సాధించవచ్చు  రాతియుగంలో  పచ్చి మాంసాన్ని తినడానికి  అలవాటు పడిన వాడు  దానిని కాల్చి తింటే ఎలా ఉంటుంది అని ఆలోచించి  నిప్పు తయారు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎలా చేయాలో ఎవరికీ తెలియదు  రాతిని రాతిని కొట్టుకుంటూ  చిన్నచిన్న రవ్వలు రావడం చూసినవారు  చెట్టు నుంచి ఎండిన కొమ్మలను  సేకరించి ఒకదానితో మరొకటి  ఘర్షణ పడేట్లుగా  ఒకదాని పైన మరొకటి వేసి రుద్దగా రుద్దగా  నిప్పు రావడాన్ని గ్రహించాడు.  ఎంతో ఆలోచించి  దానికి తగిన కృషిచేసి తగిన ఫలితాన్ని పొందవచ్చు అని వేమన యోగి మనకు తెలియజేస్తున్నారు.అలాగే మరొక ఉదాహరణ. మానవుడు పశువులను  పెంచుతూ  దాని పాలను  సేకరించి  పచ్చిపాలతో పొట్ట నింపుకునేవాడు  తరువాత ఆలోచన పెరిగి  దానిని బాగా కాచిన తర్వాత  తాగడం అలవాటు చేసుకున్నాడు  దీని నుంచి ఇంకా ఏం తయారు చేయవచ్చు  అన్న ఆలోచన వచ్చినప్పుడు  మీగడతో పాటుగా  ఆ పాలను తోడు పెట్టి అది పెరుగుగా మారిన తర్వాత  ఒక కవ్వాన్ని తయారుచేసి  దాని ద్వారా చిలికి చిలికి వెన్న తీయడాన్ని  నేర్చుకున్నాడు  అలా అంచలంచెలుగా తన మేధను  ఉపయోగించి దానివల్ల ఏ ఫలితం వస్తుందో అర్థం చేసుకొని  దానిని  అనుభవించడానికి సిద్ధపడ్డాడు  అభ్యుదయ మానవుడు  మనిషి తలచుకుంటే చేయలేనిది ఏది లేదు అని రుజువు చేశారు కూడా. ఇంక చివరి ప్రయత్నం ఏమిటో చెప్తున్నాడు వేమన. మునులను రుషులను  చూసి వారు ఎందుకు తపస్సు చేస్తున్నారు  దాని ప్రయోజనం ఏమిటి  అని  దాని గురించి తెలిసిన వారి దగ్గరకు వెళ్లి  విషయాన్ని అడిగి తెలుసుకుని  దానిని సాధన చేయడం కోసం ప్రయత్నిస్తున్నాడు మానవుడు  భౌతిక లోకంలో దొరకని  సుఖము శాంతి పరలోకంలో దొరుకుతుందని వేదాంతులు చెప్పిన విషయాన్ని విని దానికోసం ప్రయత్నిస్తూ ఒక దానిని గురించి ఆలోచిస్తూ మరొక దాని  కోసం ప్రయత్నిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ  తన శరీరంలో ఉన్న అరిషడ్వర్గాలను దూరం చేసి  దేనిని సాటించాలనుకున్నాడో దానికోసం  ఆలోచించగా ఆలోచించగా  తత్వం అర్థమవుతుంది  ఇక్కడ ఎవరూ లేరు ఉన్నది నేనే  దానిని తెలుసుకోవడమే తత్వం ఏదైతే ఉన్నదో దానిని నేను అని చెబుతోంది  కనుక  దానిని సాధిస్తాడు. ప్రయత్నం చేస్తే  అన్నీ మన చేతికి చిక్కుతాయి అని చెప్పే వేమన పద్యం ఒక్కసారి చదవండి.

తరువ తరువ బుట్టు తరువుననలంబు  
తరువ తరువ బుట్టు ధతి వెన్న  
తలప తలప బుట్టు తనువున తత్త్వంబు..."


కామెంట్‌లు