పల్లవి...మూడు ముళ్ళా బంధం ముచ్చటనే గొలుపునూ
ఏడడుగుల అనుబంధం
ఏకము చేసేటి
భార్యా భర్తలదీ అపురూప సంబంధం "మూడు ముళ్ళా"
1 చ# పుడమిలోన పుట్టినా-
ఆడ,మగ జన్మము
అమ్మాతో ముడి పడిన-బొడ్డు పేగు బంధం
నాన్నతో పెన వేసిన నడతలోని బంధం "మూడు"
2చ# సృష్టినే సృష్టించే-ఆలుమగలా బంధం
తనువులు వేరైనా-తన్మయత్వపు ప్రాణము
రక్త మాంసాలతో-రసమయమై కలిసి
రమ్యతనే గొలుపు-రాజ్యాన ఈ బంధం "మూడు"
3చ# కష్టాసుఖాలను-కలసీదే ప్రాణాలు
బ్రతుకూ బండినీ తోలే-చక్రాల సారథులు
మాట పట్టింపులతో-మమతాలు విడనాడి
నల్లేటి నడకాలై-సాగి తెగి పోతున్నాయి "మూడు"
4చ#నమ్మకమన్నాదీ-నానీ సన్నాగిల్లి
బంధాల విలువలు-బజారు సరకులై
కూలి పోతున్నాయి-కుమిలి జీవితాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి