సిసింద్రీ; - సుమ కైకాల
1. ఓ రాగం
    నా మనసులో అశాంతి తొలిగేలా
    నా పెదవులపై  చిరునవ్వు చిందేలా!!

2. ఓ చిన్నారి
    మమతల బంగారు తల్లి
    మధురమైన వెన్నెల జాబిల్లి!!

3. ఓ పరిచయం
    ఆత్మీయతను పెంచుతుంది
    ఆప్యాయతను  పంచుతుంది!!

4. ఓ చెలిమి
    అనుక్షణం తోడు నీడగా
    అనుబంధం అండ దండగా!!

5. ఓ అమ్మ
    అద్భుతమైన ప్రేమ రూపం
    అనంతమైన శక్తి స్వరూపం!!

కామెంట్‌లు