పున్నమివెన్నెల చూద్దాం(బాలగేయం)--గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
చుక్కలగగనము చూద్దాము
తళతళతారల చూద్దాము
నక్షత్రాలు  లెక్కిద్దాము
కాలక్షేపము చేద్దాము

చందమామను చూద్దాము
చక్కదనాలను చూద్దాము
చల్లనివెన్నెల చూద్దాము
చాలాసంబర పడదాము

నీలాకాశము చూద్దాము
నేత్రాలకు విందిద్దాము
వెండిమబ్బులను చూద్దాము
వెన్నెలలో విహరిద్దాము


కామెంట్‌లు