మనసులోని మాలిన్యాలను తొలగిస్తుంది పుస్తకం.
మన ఊహలకు
రెక్కలనిస్తుంది పుస్తకం.
మరో లోకానికి తీసుకు వెళుతుంది పుస్తకం.
ఆలోచన శక్తిని పెంచుతుంది
పుస్తకం.
మానసిక వికాసాన్ని కలిగిస్తుంది పుస్తకం.
మానవతా విలువలను నేర్పుతుంది పుస్తకం.
మేధావులను పరిచయం చేస్తుంది పుస్తకం.
ప్రగతికి దారులను చూపుతుంది పుస్తకం.
ప్రతిభావంతులను చేస్తుంది
పుస్తకం.
మంచి పుస్తకం చదవడం వలన మనసుకు ఉత్తేజం కలుగుతుంది.
మానసికంగా కుంగిపోయిన మనిషికి ఉత్సాహాన్నిస్తుంది.
పుస్తకాలతో స్నేహం చేయాలి.మస్తకాలను మెరుగుపరుకోవాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి