సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 వరించు...వారించు
  ******
మనిషి  మనసు కోరికల పుట్ట.అంతులేని ఆశలకు ఆలవాలం.
ఎన్నింటినో వరిస్తుంది.ఏవేవో కావాలని ఆశపడుతుంది.కొన్నింటిని చూసి ముచ్చటపడుతుంది.తనకు కావలసినవి ఇతరుల నుండి పొందాలని ఆకాంక్షిస్తుంది. దీనంగా అర్థిస్తుంది.ఇచ్చిన వాటితో తృప్తి పడక కొసరు కావాలంటుంది.ఇలాంటి కోరికల, ఆలోచనల నిలయం మనసు.
ఈపాటికి వరించు పదానికి  ఏమేమి అర్థాలున్నాయో తెలిసిపోయాయి.
కోరు,అపేక్షించు,అభ్యర్థించు,ఆశించు,ఆశపడు,అర్థించు,కోరుకొను,వాంఛించు,చేచాచు,ముచ్చటపడు,కొసరు,ఆకాంక్షించు,కాంక్షించు,అభిలషించు ...మొదలైన అర్థాలే కాకుండా పెండ్లాడు,కట్టుకొను,పరిణయమాడు అనే అర్థాలు కూడా ఉన్నాయి.
ఆశాపాశాలకు లోబడే మనసును అదుపులో పెట్టుకోవాలి.అత్యాశలు,అలవిగాని కోరికలను మనసు దరిదాపుల్లోకి రాకుండా వారించాలి. కోరికలకు కళ్ళెం వేసి అడ్డు కోవాలి.
వ్యక్తిగతంగానే కాకుండా,    బాధ్యతాయుతమైన వ్యక్తులుగా  సమాజంలో జరిగే అవాంఛనీయ ఘటనలను, పోకడలను, సమస్యలను వారించాలి.దురాచారాలు,మూఢ నమ్మకాలను వారించుటలో ముందుండాలి.
ముఖ్యంగా బాల్య దశలో ఉన్న విద్యార్థుల్లో తెలిసి తెలియక పెంచుకున్న అపోహలను వారించాలి.  భవిష్యత్తులో అవే నిజాలనే భ్రమల్లో బ్రతికే ప్రమాదం ఉంది.కాబట్టి అలాంటి వాటిని మొగ్గదశలోనే వారించాలి.
మరి వారించాలి అంటే ఏయే అర్థాలున్నాయో చూద్దాం...ఆటంకపఱచు,అంకిలిపెట్టు,అడ్డగించు,అవరోధించు,అడ్డుకొను,ఆకించు,ఆపు,నిరోధించు,నిలువరించు,మానించు,నివారించు,రోధించు,ప్రతిబంధించు,అరికట్టు,అటకాయించు మొదలైన అర్థాలు ఉన్నాయి.
మంచి అలవాట్లను వరించుదాం.చెడు పోకడలను వారించుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం