ఇందుమతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 విదర్భ రాజు భోజుడు.అతని సోదరి ఇందుమతి. స్వయంవరానికి కోసలరాకుమారుడు అజుడు బైలుదేరాడు. నర్మదానదీతీరంలో ఓ మదపుటేనుగు అతని రధాలు గుర్రాలను కకావికలం చేస్తోంది. అజుడు తనబాణంతో దాని కుంభస్థలం ని చీల్చాడు.అదినేలకూలటం ఆలస్యం అందులోంచి దివ్యపురుషుడు లేచి"రాకుమారా!నేను గంధర్వ రాకుమారుడు ప్రియంవదనుడను.మతంగముని శాపంవల్ల ఏనుగుగా మారాను.మీవల్లనే శాపవిముక్తి కలిగింది. "అని సమ్మోహన అస్త్రం ని బహూకరించాడు. అజుడు విదర్భ చేరాడు.ఇందుమతి స్వయంవరానికి వెళ్లాడు.ఆమె ఇతనిమెళ్లో పూలమాలవేసింది.మిగతా రాజులు అజునిపై దాడిచేస్తే  గంధర్వుడు ఇచ్చిన అస్త్రం తో వారిని ఓడించాడు.రఘుమహారాజు కొడుకు కోడలికి స్వాగతం పలికి అజుడు కి రాజ్యభారం అప్పగించి తపస్సు కై అడవులకు వెళ్లాడు.
ఆరోజు భార్య తో వనవిహారం చేస్తున్నాడు అజుడు. ఆకాశంలో నారదుడు హరిసంకీర్తన కావిస్తూ సంచరిస్తున్నాడు.ఆయన మెడలోని పూలమాల ఇందుమతి పై పడగానే ఆమె ప్రాణం విడిచింది.రాజు విలపిస్తూ ఉంటే కులగురువు ఇలా ఓదార్చాడు " రాజా! తృణబిందు అనే మహర్షి కి తపోభంగం కలిగించమని ఇంద్రుడు హరిణి అనే అప్సరసను పంపాడు.ఆమెను ముని శపించాడు " నీవు మానవకాంతగా పుడ్తావు.స్వర్గంలోని పుష్పం నీపై పడగానే శాపవిముక్తి కలుగుతుంది. " ఇందుమతిగాపుట్టి నీభార్య ఐంది. నారదుడి మెడలోని పూలమాల జారి ఆమెకి శాపవిమోచనం కలిగింది. "అని వివరించాడు. ఆవంశంలో వారే దశరథుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు.ఇలాంటిపురాణ కథలు ఆనాటి రాజుల పాలన మనం తెలుసుకుంటూ ఉండాలి 🌷
కామెంట్‌లు