కన్నవారు వేల్పులు(బాలగేయం)---గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
మిన్న కదా మహిలో
కన్నవారి ప్రేమలు
ఎన్న తరమా? సేవలు
పన్నీటి జల్లులు

తల్లిదండ్రులు  భువిలో
కనిపించే వేల్పులు
దైవానికి సాక్షులు
త్యాగానికి తరువులు

అమ్మానాన్నల కలలు
అవనిలోన పిల్లలు
ఆశయ సాధనలో
అచ్చంగా పిడుగులు

కన్నవారి మనసులు
కష్టబెట్ట కూడదు
మనసు గాయపడితే
ఆశీర్వాదముండదు


కామెంట్‌లు