ప్రబోధ గీతం :-నింగినవ్వుతోంది; -- కోరాడ నరసింహా రావు !
సాకీ :-
       నీవే  గొప్ప వాడ వనీ .... 
  నిన్నుమించి ఈ ఇలలో... 
    ఏ ప్రాణీ  లేదనీ...  కన్ను - మిన్ను గానక, విఱ్ఱవీగు 
          ఓ మనిషీ.... !
పల్లవి :-
    నింగి నవ్వుతోంది, నేలనవ్వు
తోంది... నీరునవ్వుతోంది, గాలి నవ్వుతోంది, ఓ మనిషీ... !
         నీ అజ్ఞానం చూసీ... !! 
       " నింగి నవ్వుతోంది.... "
చరణం :-
    ఏమిటి నీ గొప్ప ? నువ్వెవరి కన్న ఎక్కువ.... 2
  గాలి, నీరు లేకనీవు క్షణమైనా 
 బ్రతుకగలవా.... !
       " ఏమిటి నీ గొప్ప.... "
     నీకు ఆధార భూతమైన నేల తల్లికే,ఆధారభూతుడుఆఆకాశ
 తండ్రి.... !
    ప్రకృతి కరుణా కటాక్ష దయా
ధర్మ భిక్షతో బ్రతుకుతున్న నీ కెం దుకు ఇంత గర్వము... 
        ఇంత గర్వము.... !
     " నింగి నవ్వుతోంది.... "
చరణం :-
    మట్టి, చెట్టు...సూర్య, చంద్రా
దులకు, ఇతరులకిచ్చుటే గాని 
తిరిగి తీసికొనుట తెలియదు. 2
ఆత్యాగమునలవరచుకొనుము 
నీ స్వార్ధమును వీడుము.... 2
  అహంకారమును వదలి... 
 ఐకమత్యమున కూడి... 
   హాయిగా నీవు సుఖించు... 
  ఈ జగతికి ఆనందం పంచు 
      ఆ నందం   పంచు... 
   ఆ నందం పంచు.... !!
        *******

కామెంట్‌లు