ఈ క్షణం ఓ నిజం
మరు క్షణం అది గతం
ఓ జ్ఞాపకంగా మారిపోతుంది
దృశ్యం తరువాత దృశ్యం కదిలిపోతుంది
రేపటికి స్మృతిగా మిగిలిపోతుంది
వసంతంలోని మధురిమలను
శిశిరంలోని విషాదాలను
తనలో కలుపుకుని మౌనంగా
మనల్ని వీడిపోతుంది...
వర్తమానం అనేది కాలంలో ఒక భాగం
జరిగిన దానిలోనో
జరగబోయే దానిలోనో
మనసు ఊయలలూగి
వర్తమాన క్షణాలను జారవిడుచుకుంటుంది
వాస్తవంలో వర్తమానం కాలానికి అతీతం
కాల సింధువులో మరో వత్సరం
కనుమరుగవుతుoది
ఎన్ని మెట్లు ఎక్కామన్నది కాదు
ఎంత ఎత్తుకి ఎదిగామన్నది కాదు
ఎన్ని మునకలేసామన్నది కాదు
ఎన్ని లోతులు చూసామన్నది ముఖ్యం
కాలవాహినిలోని మేలిమలుపుల్లో
స్ఫూర్తిదాయకమైన నిర్ణయాలు తీసుకోవాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి