సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 పారక్యము...పారమ్యము
  *****
మన మంచి ఆలోచనలకు, ఆశయాలకు చేసే హితకరమైన పనులకి అనుకూలమైన  వాతావరణం, సాటి వారి ప్రశంసలు అంత తొందరగా ఎప్పుడూ లభించవు.
మార్పును,మంచిని అంగీకరించడానికి   చాలా మంది అంత త్వరగా ముందుకు రారు.
అంత మాత్రాన నిరాశ పడాల్సిన అవసరం లేదు. పారక్యము నుండే ప్రతిభా సామర్థ్యాలు బయటపడేది. ముళ్ళ కంచెల్లోంచి కూడా పువ్వు ధైర్యంగా తలెత్తుకుని తన పరిమళాలు పంచడం చూస్తుంటాం. పారక్యము ఎదురయ్యినప్పుడే మనలో మరింత పట్టుదల పెరగాలి. అదే ధీరత్వం.
ఇంతకూ పారక్యము అంటే ఏమిటో చూద్దాం... ప్రతికూలము,ఎదురు చుక్క,ప్రతీకము,ప్రతీపము, వ్యతిరేకము, వైరుధ్యము, విరుద్ధము,ప్రాతి కూలము,భిన్నము, విముఖము లాంటి అర్థాలు ఉన్నాయి.
అలాంటి పారక్యముతో ఉన్నవారే  చిత్త శుద్ధితో చేసే పనుల్లోని  పారమ్యమును చూసి  అభినందించకుండా ఉండలేరు.
పారమ్యము అంటే శ్రేష్ఠము, ఉత్తమము వరము, యోగ్యము మేలు, మేలిమి,అగ్ర్యము, శ్రేయము,నాణ్యము లాంటి అనేక అర్థాలు ఉన్నాయి.
మన ఆశయాలు, లక్ష్యాలు సమాజ శ్రేయస్సుకు ఉపయోగ పడాలి.అలాంటి పారమ్యమైన పనులకు మొదట్లో పారక్యము ఎదురైనా ఆ తర్వాత ఆ పనులే ఆదరణ, ప్రశంసలు తప్పకుండా అందుకుంటాయి.
పారక్యమును మనో విశ్వాసముతో అధిగమించాలి.పారమ్యము గల పనులను సదా చేస్తూనే ఉండాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం