సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 అనుభవము...అనుభావము
******
మనిషి జీవితము అనుభవాల సారము. నిత్య జీవితంలో ఎదుర్కొనే  సంఘటనలు, సమస్యలు, చేసే పనులు అనేక రకాల జ్ఞానాన్ని ఇస్తాయి.ఎన్నో విధాలైన ఫలితాలను ఇస్తాయి. విషయాలను అనుభూతించేలా చేస్తాయి. ఇలా పొందే జ్ఞానమును, ఫలితాలనే అనుభవము అంటాం.
అనుభవానికి ఉన్న అర్థాలు... స్మృతి భిన్న జ్ఞానము,అనుభుక్తి, అనుభూతి అనుభోగము ఉప భోగము ఉపలంభము చవి పరిభోగము సంవేదన స్వాదనము  మొదలైనవి.
అనుభవాలు మనసు,శరీరాల మీద అనుభావము చూపుతాయి.ఇంద్రియాలపై పెత్తనము చేస్తాయి.ఎలాంటి నిర్ణయము తీసుకోవాలో ఆదేశిస్తాయి.తనదైన ప్రత్యేక సిద్ధాంతాన్ని ప్రతిపాదించేలా చూస్తాయి.
ఇలా మనిషిలోని మంచి చెడుల, మానసిక స్థితిని, గుణాలను బట్టి అనుభావము తన ఉనికిని చా

టుకుంటుంది.
అనుభావము అంటే ఏమిటో చూద్దాం... ప్రభావము,తేజు పోతరము, మహిమ, వీక, నిశ్చయము, అవధారము, నిర్ణయము నిచ్చలము ,నిర్థారణము, నిష్కర్షము, వ్యవసితము, ధ్రువము, ఖరారు, స్థితి,చిక్కపట్టు నిచ్చయము ,ధ్రువము, అవదారణము, అధికారము, అజ్మాయిషీ జబర్ దస్తీ ,పెత్తనము, పట్టము, పదవి, పలుకుబడి పెద్దరికము,మన్నెఱికము లాంటి అర్థాలు ఉన్నాయి.
అనుభవము అనుభావములు ...ఇవి రెండూ మనిషికి సహజంగా, ప్రయత్నపూర్వకంగా వచ్చేవి.
అనుభవము అవసరమైన జ్ఞానాన్ని అందిస్తుంది.అనుభావము ఆ జ్ఞానానికి మూలమైన మనిషిని వివిధ కోణాల్లో చూపెడుతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు