ఆ ముగ్గరు గురువులు;-- యామిజాల జగదీశ్
 ఓ ఊళ్ళో ఓ జ్ఞాని. ఆయన చాలా ప్రసిద్ధి పొందిన జ్ఞాని. ఆయన అంతిమదశకు చేరుకున్నారు. ఓరోజు ఆయన వద్దకు కొందరు వచ్చారు.
"మీ గురువెవరు?" ఐని అడిగారు వారు.
ఆయన వారి వంక తదేకంగా చూశారు. తనకెందరో గురువులున్నారని, వారి పేర్లన్నీ చెప్పుకుంటూ పోతే ఈ జీవితం చాలదని, కనుక ఓ ముగ్గురి గురించి మాత్రం చెప్తానన్నారా జ్ఞాని.
ఆ ముగ్గురిలో ఒకరు ఓ దొంగ. 
ఓమారు ఒక ఎడారి గుండా నేను పోతున్నాను. అప్పుడు దారి తప్పి ఓ గ్రామంలోకి ప్రవేశించాను. అది చుకటి వేళ. ఊరు ఊరంతా నిద్రపోతోంది. ఆ సమయంలో ఒకడు కనిపించాడు. అతని దగ్గరకు వెళ్ళి ఈరోజు మీ ఇంట ఉండి పొద్దున్నే లేచి వెళ్ళిపోతాను అని అన్నాను. 
అందుకతను "ఈ రాత్రి ఒక దొంగతో మీరు ఉండగలరనుకుంటే ఉండొచ్చు" అన్నాడు.
తీరా ఒక రోజనుకున్న వాడిని నెల రోజులు అతనింట ఉండిపోయాను. ప్రతి రోజు రాత్రి అతను నేను నా పనికళ్తున్నాను. మీరు విశ్రాంతి తీసుకోండి అని వెళ్ళేవాడు.
అతను తిరిగి రావడంతోనే నీకేదైనా దొరికిందా అని అడిగేవాడిని.
అందుకతను ఏమీ దొరకలేదు అనేవాడు. అయినా రేపు మళ్ళీ ప్రయత్నిస్తాను అంటూ తన పనికి వెళ్ళేవాడు తప్ప ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోలేదు. ఎప్పుడూ సంతోషంగానే ఉండేవాడు. నేను చాలా కాలంగా ధ్యానం చేస్తున్నాను. కానీ ఏమీ జరగలేదు. దాంతో నేను బాధపడేవాడిని. నమ్మకం కోల్పోతుండేవాడిని. అప్పుడు ఈ దొంగ పట్టుదల ప్రయత్నం గుర్తుకొచ్చేవి.
నా రెండో గురువు ఒక కుక్క. 
ఓమారు నాకు చాలా దాహమేసింది. ఓ నదీ తీరానికి పోయాను. అప్పుడక్కడికి ఒక కుక్క వచ్చింది. అక్కడి నీటిలో తన నీడను చూసుకుని భయపడింది. అది తన సొంత రూపాన్ని చూసుకుని భయపడింది. అరిచింది. వెనక్కు పోయింది. దాహమెక్కువ వేయడంతో మళ్ళీ మళ్ళీ వచ్చేది. ఇలా చాలాసార్లు చేసింది. అయినా చివరకు నీటిలో దూకింది. ఇలా దూకినప్పుడు దాని రూపం కనిపించలేదు. ఈ సంఘటనతో నన్ను నేను అర్థం చేసుకున్నాను. భయమున్నాసరే అనుకున్న పని సాధించాలంటే ధైర్యంగా ముందడుగు వేయాలని. ఈ బోధన ఆ కుక్క నుంచి తెలుసుకున్నాను.
ఇక నా మూడో గురువు ఒక చిన్న పాప. నేనోమారు ఒక నగరానికి వెళ్ళాను. అక్కడ ఆ చిన్నారి వెలుగుతున్న కొవ్వొత్తిని తీసుకాచ్చింది. అప్పుడా చిన్నారిని ఈ కొవ్వొత్తిని నువ్వే వెలిగించేవా అని. అవునంది ఆ చిన్నారి.
ఈ కొవ్వొత్తి మొదట వెలగలేదు కదా.  ఇప్పుడు వెలుగుతోంది. ఈ కొవ్వొత్తికి వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందో చూపించగలవా అని ఆ చిన్నారిని అడిగాను. 
అందుకా చిన్నారి నవ్వింది. ఆ కొవ్వొత్తిని ఊది ఆర్పింది.ఆ తర్వాత నన్నడిగింది. ఇప్పుడీ కొవ్వొత్తి వెలుగు ఎటు పోయిందో చెప్పగలరా అని అడిగినప్పుడు నాలోని అహం అణగిపోయింది. నేను చదువుకున్నదేదీ ఆ సమయంలో ఎందుకూ పనికిరాలేదు. ఆరిపోయిన వెలుగు ఎటు పోయిందో చెప్పలేకపోయాను. నా మూర్ఖత్వాన్ని తెలుసుకున్నాను అన్నారు జ్ఞాని.
 
ఇందుమూలంగా ఫలానాది ఫలానా వ్యక్తి నుంచే నేర్చుకోవాలనేం లేదు. ఎవరి నుంచేనా ఏదైనా తెలుసుకోవచ్చు. 

కామెంట్‌లు