- దుష్ట సంహారంతోనే... !;-కోరాడ నరసింహా రావు !
లోక కళ్యాణం కోసమే.... 
 నారాయణుడు మత్స్య, కూర్మ 
వరాహ నారసింహాదిఅవతారా
లతోపాటు....శ్రీరామ,శ్రీకృష్ణులు గా నరుడై పుట్టాడు.... !
  
 దుష్ట సంహారం జరగనిదే.... 
   లోకకళ్యాణానికి ఆస్కారం లేదు... !

ఈ కలియుగంలో అపరిమితం గాపెరిగిపోయిన అన్యాయాల నూ, అక్రమాలనూ... నిరోధించ టానికేఆశ్రీహరికిప్రతినిధులుగా ...కవులు,రచయితలు,సాహితీ వేత్తలు, సంస్కర్తలు  ఈ సమా జంలో అవతరించారు.. !

ఈ కలియుగ పోరాటంఅంతు
లేని బాహ్య శత్రువులతో కాదు 
మనిషిలోనున్న ఆరుగురు అంతర్ శత్రువులతో....!

వ్యక్తి ఈ అంతర్ శత్రువులను జయిస్తే చాలు... !
  ఇక బయట అసలు శత్రువులే 
ఉండరు...!!
   
   ఆ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది  శత్రువులు తొలగిపోయి... జాలి, దయ, ప్రేమ, సేవ, త్యాగం మొదలైన మిత్రులందరూ ఆ స్థానంలో కొలువైపోతారు... !

ఇంక...లోకమంతాస్నేహ,సౌభ్రాతృత్వ సుహృద్భావ పరిమళా లే.... !!
 ఇంతకంటేలోకకళ్యాణమేముం టుంది...! 

 ఓ కవులారా... కళాకారులారా 
రచయితలారా...సంస్కర్త లారా
మీ మీ ప్రతిభలు చాటుకునేం దుకో... సన్మాన, సత్కారాల కోసమో... తాపత్రయ పడకండి 
మీరు ఆ దైవానికి ప్రతినిధులు !
 మీ లక్ష్యము - ధ్యేయము.. మీ 
ప్రయత్న మంతా లోక కళ్యాణం కోసమే... !!

మీ ప్రతిభను మనుషుల్లోని చెడును పూర్తిగా తొలగించి... 
మంచిని పెంచటంలో చూపిం చండి...!

మీరే... ఈ లోకకల్యాణ కర్తలు 
మీరు అకుంఠిత దీక్షతో ప్రయత్నిస్తేనే... ఈ లోకానికి కళ్యాణం.... !!
      ********

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం