తర్కించు...తర్జించు
******
ఏది మంచి ఏది చెడో తర్కించుకోవాలి. బాగా ఆలోచించాలి.సాధ్యాసాధ్యాలను యోచించాలి.
మనం చేసే మంచి పనులను ఎవరైనా విమర్శిస్తే వారికి అర్థమయ్యేలా వివరించాలి.అప్పుడే మనం చేసే వాటిల్లో స్పష్టత వారికి తెలుస్తుంది.తద్వారా వారి సానుకూలమైన మద్దతును కూడగట్టుకోవచ్చు.
ఈపాటికి తర్కించు అంటే ఏమిటో అర్థమై వుంటుంది.
తర్కించు అంటే ఆలోచించు,గణించు,చింతించు,తలపోయు,యోచించు,భావించు,విచారించు,వివేకించు,వగచు లాంటి అర్థాలతో పాటు వాదించు,తరకటించు,సంవాదించు,వాదాడు అనే అర్థాలు కూడా ఉన్నాయి.
ఇలాంటి సందర్భాల్లో పిల్లలు కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. చిన్న వారు కదాని వారి మాటలు తీసేయకుండా, వాళ్ళ అభిప్రాయాలను కూడా బాగా తర్కించి పరిగణనలోకి తీసుకోవాలి.అంతే కానీ వారిని తర్జించకూడదు.
పిల్లల మనసులు చాలా సున్నితమైనవి.
కొంతమందైతే పిల్లలు ఏది చేయబోయినా తర్జిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల పిల్లల్లో అనవసరమైన భయాలు పెరుగుతాయి.తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించలేరు.పిరికి వారిగా మారే అవకాశం ఉంది.కాబట్టి అనవసరంగా తర్జించడం మానేయాలి.
తర్జించు అంటే ఏమిటో చూద్దాం...తర్జించు అంటే అదలించు,అదరించు,
గద్దించు,జళికించు,దట్టించు అనే అర్థాలు ఉన్నాయి.
తర్కించుటలో మన వివేకం విజ్ఞత కనపడాలి.తర్జించుటలో సహేతుకమైన కారణం కనపడాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి