అది 1877 వ సంవత్సరం.
మన దేశంలో తీవ్ర అనావృష్టి నెలకొంది. ఆకలి చావుల సంఖ్య యాభై లక్షలు దాటింది. ఆకలితో మలమలా మాడుతున్న పిల్లలెందరో లెక్కేలేదు. పట్టెడన్నం దొరకని స్థితి.
దీంతో అమెరికాకు చెందిన క్రైస్తవ సంస్థల ప్రతినిధులు కొందరు బాధితులకు వైద్యసేవలు అందించడానికి, ఆహారం పంపిణీ చేయడానికి నావలపై మన దేశానికి వచ్చారు. అలా తమిళనాడులోని రాణిపేటకు తన కుటుంబంతోపాటు వచ్చిన డాక్టరే జాన్ స్కడర్. ఆయన భార్య పేరు సోఫియా స్కడర్. జాన్ స్కడర్ తొలుత దిండివనంలో వైద్యసేవలు అందించారు. స్కడర్ దంపతులకు
అయిదో సంతానంగా 1870 డిసెంబర్ 9వ తేదీన జన్మించారు Ida John !!
ఒకరోజు రాత్రి తలుపు తడుతున్న శబ్దం విని జాన్ స్కడర్ కుమార్తె Ida John Scudder తలుపు తెరిచారు. వాకిట్లో ఓ వ్యక్తి నిల్చున్నాడు. ఆయనొక విప్రుడు.
"అమ్మా, నా భార్య ప్రసవ వేదనతో తల్లడిల్లుతోంది. మీరు సాయం చేయాలి. వెంట వస్తారా" అని ఆ మనిషి నమస్కరించాడు.
అప్పుడామె "నేను డాక్టర్ కాదు. మా నాన్నే డాక్టర్. కాస్త ఉండండి. మా నాన్నను లేపి పంపిస్తాను" అన్నారు Ida John Scudder.
"మీ నాన్నగారైతే వద్దమ్మా...నా భార్యకు పద్నాలుగేళ్ళే. మేం బ్రాహ్మణులం. ఓ స్త్రీని పరాయి పురుషుడు తాకడానికి అనుమతించం" అంటూ ఆ మనిషి వెనుతిరిగి వెళ్ళిపోయాడు.
కాస్సేపటికి ఓ ముస్లిం మనిషి ఆ తలుపు తట్టాడు. "నా భార్య ప్రసవవేదనతో బాధ పడుతోంది ...వెంటనే రావాలి" అని పిలిచాడు.
అప్పుడు ఆమె "మా నాన్నను పంపిస్తాను...ఉండండి" అన్నారు.
అయితే ఆ మనిషీ "మేం మహమ్మదీ యులం. మా జాతిలో ప్రసవాలను మగవారు చూడకూడదు" అని అతనూ వెళ్ళిపోయాడు.
ఆప్పుడామె ఆలోచనలో పడింది. రాత్రంతా తమ ఇంటి తలుపు తట్టిన ఆ ఇద్దరు వ్యక్తులూ కళ్ళముందు కనిపించారు. తీరా మరుసటిరోజు ఉదయం ఆ గర్భిణీ స్త్రీల శవాలు తమ ఇంటి ముందు నుంచి పోతుండటం చూసి ఆమె రోదించింది.
"ఏం దేశమిది? ఆడవారిని చదివించరట... కానీ ఆడవారికి ఆడవారే వైద్యం చేయాలట. ఈ దేశంలో ఆడవాళ్ళు చదవకుంటేనేం... నేను చదువుకుని ఇక్కడి ఆడవారిని కాపాడుతాను" అని ఆ రోజే ప్రతిజ్ఞ చేసిన ఆమె అమెరికా వెళ్ళి చదువుకుని డాక్టరయ్యారు.
ఈ క్రమంలో ఆమెను ఒక మిత్రుడు ప్రేమించాడు. కానీ ఆమె ఆ ప్రేమను తిరస్కరించారు. అమెరికాలో చదువుకున్న ఆమెకు స్వదేశంలో మంచి మంచి ఉద్యోగావకాశాలు వచ్చాయి. కానీ వాటిని వద్దనుకున్న ఆమె దృష్టంతా తమిళనాడుపైనే ఉంది. ఆ రోజు రాత్రి చనిపోయిన ఆ గర్భిణీ స్త్రీల భౌతికదేహాలే కళ్ళముందు కదలాడాయి.
వొట్టి చదువుతో ఎంత మందిని కాపాడగలనని అనుకున్న ఆమె తమిళనాడులో ఓ ఆస్పత్రి ఏర్పాటు చేయడం ఎంతో అవసరమనుకున్నారు. పలు దేశాలలో భారతదేశ స్థితిగతులను వివరించి విరాళాలకోసం అర్థించారు.
ఇక ఒక్క గర్భిణీ స్త్రీని కూడా చనిపోనివ్వనని కంకణం కట్టుకున్న ఆమె 1900 జనవరిలో తమిళనాడులో స్థిరపడటానికొచ్చారు. ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభించారు. నలభై పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేశారు. స్త్రీలకు ఎటువంటి హక్కూ లేదనే రోజుల్లో ఆమె మహిళల కోసం ప్రత్యేకించి ఓ ఆస్పత్రిని నిర్మించారు.
భారతదేశంలోనే కాక ఆసియా ఖండంలోనే దానికో ప్రత్యేక గుర్తింపు లభించింది. వందేళ్ళు పూర్తి చేసుకుని ఇప్పటికీ ప్రశంసలందుకుంటున్న ఆ ఆస్పత్రి పేరే వేలూరు సిఎంసి ఆస్పత్రి!
ఆమె పని అక్కడితో ముగియలేదు. ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటి తలుపు తట్టి మీ ఇంట్లో ఉన్న అమ్మాయిలను చదవడానికి పంపించండి అని బతిమాలారు. అయితే ఓ అయిదుగురు అమ్మాయిలు మాత్రమే ఆమె పిలుపునకు స్పందించి చదువుకోవడానికి ముందుకొచ్చారు. వారికి వైద్యానికి సంబంధించి శిక్షణ ఇచ్చి పరీక్ష రాయించి ప్యాస్ అయ్యేలా చేశారు. ఆ అయిదుగురే తమిళనాడులో మొట్టమొదటి నర్సులు.
మన దేశంలో స్త్రీలు వైద్యం చదవడానికి పునాదిరాయి వేసింది ఆమె కావడం గమనించదగ్గ అంశం.
ఇంతకూ ఎవరా స్త్రీ?
ఆమె మనకోసం ఎందుకు బాధపడాలి?
ఆమె హృదయం మనకోసం ఎందుకు కరగాలి?
ఆమె మన కోసమే తుదిశ్వాస వరకూ బతికారు?
ఎక్కడో పుట్టి
ఎక్కడో పెరిగి
తమిళనాడుకు తమ జీవితాన్ని అంకితం చేసిన ఆమెనే మదర్ థెరసాకు "ఆదర్శం" అని చెప్పుకోవడం తప్పేమీ కాదు.
ఓ స్త్రీ ఒంటరిగా నిలిచి వెలిగించిన కొవ్వొత్తి ఈరోజు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ అంతర్జాతీయ స్థాయిలో "వేలూరు సిఎంసి" వినుతికెక్కడమంటే మాటలా? లక్షలాది మందికి ఊపిరి పోసింది ఆ ఆస్పత్రి. ఆమెను మనుషులలో దేవతగా అభివర్ణించడం అన్ని విధాలా సమంజసమే కదూ!
ఆమె తొంభయ్యో ఏట 1960 మే 24న కాలధర్మం చెందారు. ఆమె సేవలను స్మరిస్తూ కేంద్ర ప్రభుత్వం 2000 ఆగస్ట్ 12వ తేదీన ఓ ప్రత్యేక స్టాంపుని విడుదల చేసింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి