చిన్నారుల చిరాశ(బాలగేయం);--గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు
గురుదేవుల సన్నిధిలో
ఉన్నతంగా ఎదుగుతాం
వారు చూపే బాటలో
రవి కాంతులై వెలుగుతాం

పెద్దవారి మాటల్లో
ఆంతర్యమే ఎరుగుతాం
మహనీయుల బోధల్లో
సారాన్ని స్వీకరిస్తాం

అమ్మ నేర్పు పాఠాలను
శ్రద్ధగా ఆలకిస్తాం
ఆమె పాడే పాటలను
గళమెత్తి అనుకరిస్తాం

భరతమాత ఆశయాలు
మనసు పెట్టి  సాధిస్తాం
గొప్ప గొప్ప నిర్ణయాలు
యోచించి తీసుకుంటాం


కామెంట్‌లు