జ్ఞానోదయం! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనలోని సకారాత్మకభావాలు  మంచి దారిలో నడిపిస్తాయి.సంకుచిత్వం లోభత్వం కూడదు.అలా అని గొప్పకుపోతే దిబ్బ అవుతాం.మనల్ని ఈసడిస్తారు అంతా! ఆరాజ్యపు కోశాధికారి ధనవర్మ మహాపిసనారి.మనసు మంచిదే! కానీ ఖజానా ఖాళీ ఐతే నష్టం అని కొన్ని ప్రజాసంక్షేమ పనులు చేసేవాడు కాదు. రాజు చెప్పినా అలాగే అని  ఊరుకున్నాడు.ఒక సారి అతని ఇంటిముందు బైరాగి భిక్షకోసం నించున్నాడు.భార్య పూరీలు చేస్తోంది. "ఏమోయ్!నాకు పెద్ద పూరీలు ఇవ్వు. బైరాగికి చిన్న పూరీలు చేసిఇవ్వు" అంది.ఆమెబైరాగి కోసం చిన్న పిండి ముద్ద తీసుకుని వత్తినా అది విస్తరాకు సైజులో  పెద్దగామారింది.కలిపిన పిండి ఐపోయింది."ఆపూరీ సగంముక్క చేసి బైరాగి కి ఇవ్వండి. నేను పిండి కలిపి మనకు చేస్తాను" అంది.పేయించిన పూరీలు ఒకదానికొకటి అతుక్కుపోయి రావటంలేదు.చేసేదేమీ లేక బైరాగి తో "అన్నీ నీవే తీసుకో. మా ఆవిడ మళ్ళీ చేస్తోంది " అని అన్నాడు. ఆశ్చర్యం!అన్నిటికన్నా కింద ఉన్న పెద్ద పూరీ దానంతట అదే ఊడి బైరాగి చేతిలో పడింది. "అయ్యా!నీభార్య మంచి మనసుతో వీటిని తయారు చేసింది.నీవు నీకడుపు నిండాలనే చూశావు.దైవలీల! భగవంతుడు అందుకే నాకు పెద్ద పూరీ ఇచ్చాడు. నీస్వార్ధం వల్ల అతుక్కుపోయాయి అవి.ఏడుస్తూ దానధర్మాలు చేయరాదు."అని బైరాగి వెళ్లి పోయాడు. అప్పటినించీ రాజా చెప్పినట్టు  రైతులకు ప్రజాసంక్షేమ పథకాలకి ఖర్చు చేయసాగాడు.రాజు మంచి వాడైనా ఇతరులు సంకుచిత్వం కలిగి ఉంటే రాజ్యం ప్రజాభిమానం కోల్పోతుంది. 🌹
కామెంట్‌లు