వికారాబాద్ జిల్లాలో మ్యాథమాటిక్స్, ఎన్విరాన్మెంట్ ప్రదర్శన; వెంకట్ , మొలక ప్రతినిధి



 వికారాబాద్ జిల్లాలో 50వ జిల్లా స్థాయి మ్యాథమాటిక్స్,,,   ఎన్విరాన్మెంట్ ప్రదర్శనను ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పాల్గొన్నజెడ్పి చైర్ పర్సన సునీత మహేందర్ రెడ్డి, మెతుకు ఆనంద్ఎమ్మెల్య బీసీ రాష్ట్ర కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ సమాజానికి ఉపయోగపడే ప్రయోగాలు చేసేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ కొత్తగడి స్కూల్ లో 50వ జిల్లా స్థాయి మ్యాథమాటిక్స్, అండ్  ఎన్విరాన్మెంట్ ప్రదర్శనను మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్, ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర బీసీ కమిషన్ మెంబెర్ శుభప్రద్  ఒక ప్రదర్శన శాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ... శాస్త్రీయ పరంగా అభివృద్ధి సాధ్యమని, ఈ మార్గంలో విద్యార్థులు నడిచి భావిశాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచించారు. వైజ్ఞానిక ప్రదర్శన ద్వారా విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెరుగుతుందని, భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
విద్యార్థులు సమయాన్ని వృథా చేయొద్దని, ప్రతి నిమిషం ఎంతో విలువైనదన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మత బయటకి తెచ్చేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగ పడుతాయని రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ అన్నారు. ఈ కార్యక్రమంలో  జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్ ,అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, డీఈవో, రేణుక  మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల  ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
 
కామెంట్‌లు