పంచ పుష్ప సౌరభాలు.;-సంధ్య శకుంతల గోళ్లమూడి
గులాబి-1
గురుతులు చాలా నినుగన
మరుపులు లేవే కనుగొన,మనసుకు రోజా!
పరుగులు బెట్టే వయసున
మురిపము గాదే  నినుగొని మధుమతి కివ్వన్.

మల్లె-2
సరసపు వేళన్ నీవే
సరిగను తూగుచు నిలిచెడి సమముయు గాదే
పరిమళ  కుటజము నీవే
పరిపరి గాథలు దెలుపును పలుకులకులుకే

జాజి-3
పరిమళము నకునెల  వేలే
సరియను గుబులును నిలుపుచు సరసపు జాజీ
కరములు తగిలిన చాలే
కురులకు యందం నిలుపుచు కులుకును నీవే.

మొగిలి-4
రంగే పసిడిగ మెరిసెను
ఖంగే దినగ నులివెట్టు కంసలి పొత్తే
చెంగే బట్టను  అతివది
రంగే మారెను  ముఖమున  రంగపు హంగే.

సంపంగి-5
అల్లు కొనంగను నిన్నే
ఝల్లున మదిన తలపుల ఝల్లిక పోదా
చెల్లును పొత్తే నీతో
చెలియకు సంపంగి నూనె చేరగ  సొగసే


కామెంట్‌లు