ముద్దుల పాపాయి;--గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు
పాపాయి నవ్వితే
ఇల్లంతా  కాంతులు
ఇంటిలో తిరిగితే
సమకూరును శుభములు

చిన్నారి పలికితే
జుంటితేనె జల్లులు
ప్రేమగా నిమిరితే
తావులీను మల్లెలు

చిన్నారి హృదయమే
కడిగినట్టి ముత్యము
తారమ్మ వదనమే
కనువిందే నిత్యము

పాపే ఇలవేల్పు
శుద్ధత పల్లవించు
మెత్తని పూలపాన్పు
తేజస్సు ఉదయించు


కామెంట్‌లు