"దాటొచ్చిన దారులలో
నన్ను నేను చూసుకుంటున్నాను!
ఈ వయస్సులో ఇప్పటికే ఇంత దూరం ప్రయాణించేనా...
వేల ఆశ్చర్యార్థకాలు నన్ను తదేకంగా చూశాయి...
ఇష్టమో కష్టమో ఆనందమో దు:ఖమో ఏదైతేనేం
ఎన్నెన్ని మలుపులో ఇన్నేళ్ళ ప్రయాణంలో...
ఎందరెందరో వచ్చారు
ఎన్నెన్నో మాటలు చెప్పారు
చెప్తే విన్నారు
అనుభవాలన్నీ గూడుకట్టుకునే ఉన్నాయి
ఎలా మరచిపోగలను
మరచిపోతే ఇంత దూరం ప్రయాణం చేసుండగలనా
ప్రేమ, పాశం, స్నేహం......
ఇవన్నీ చవిచూసినవే
అదిగో అందుకునేంత దూరంలోనే లక్ష్యం
ఇంకేం ప్రయాణం సాగించాల్సిందే అని
వేసిన అడుగులతోనే అన్నీ సాధ్యమయ్యాయి
కనుక వచ్చిన దారులను మరవలేం "
- ఇందుకు అద్దం పట్టిన ఓ పుస్తకంతో ఇటీవల మూడు రోజులు గడిపాను.
ఆ పుస్తకం పేరు - "గ్రాడ్యుయేట్ ఆటో సర్వీస్ – డౌన్ ది మెమరీ లేన్". ఈ పుస్తకం రచయిత గోవిందరాజు చక్రధర్. నూట ఇరవై పేజీలలో ఆయన చెప్పుకున్న "ఆటోరిక్షాతో అనుభవాలు" ఒక్కొక్కటీ ఒక్కొక్క తీరు.
నాకు హైదరాబాద్ విద్యానగర్‌లో పోస్టాఫీస్ ఆవరణలో ఉన్నప్పటి నుంచీ పరిచయమే. అదీనూ పాత్రికేయ మిత్రులుగా. దాదాపు మూడు దశాబ్దాలపైనే ఆయనను ఎరుగుదును. మేము ఉదయం పత్రికలోనూ, సాక్షిలోనూ సహోద్యోగులం. అప్పుడప్పుడూ కలిసి మాట్లాడుకున్న రోజులున్నాయి. కానీ ఆయన పాత్రికేయ వృత్తికి ముందు గుంటూరులో ఓ మూడేళ్ళ పాటు ఆటోరిక్షా నడిపారన్న నిజం ఇప్పుడే తెలిసింది. కొన్ని రోజుల క్రితం వాట్సప్ లో ఆయన కవర్ పేజీ ఫోటో పెట్టి పి.ఎస్. గోపాలకృష్ణగారు చెప్పిన చాలా కష్టం ఉన్నదే ఉన్నట్టు చెప్పడం మాటలు పంపినప్పుడు ఏవో తమ అనుభవాలతో ఓ కొత పుస్తకం రాసుకున్నారనుకున్నాను తప్ప చక్రధర్ గారి ఆటో జీవితం గురించి తెలియడం అదే తొలిసారి. ఈ పుస్తకానికి రాసిన ముందు మాటలో గోపాలకృష్ణగారు "లేనిది ఉన్నట్టు చెప్పుకోవడం కష్టం కావచ్చు...ఉన్నది ఉన్నట్టు చెప్పడం చాలా మందికి కష్టం కావచ్చు. వర్తమానంలో గతం గురించి చెప్పడానికి పూనుకున్న చక్రధర్ గారికి అభినందనలు" అన్నారు.
ఆటో రిక్షా నడిపితే ఎలా ఉంటుంది? అనే ఆలోచనకు స్ఫూర్తి హరకుమార్ గారైతే ఈ ప్రతిపాదనకు కార్యరూపం దాల్చటానికి చేయూతనిచ్చిన వారు కోపల్లె మురళీ కృష్ణమూర్తి బాబాయి అని రచయిత చెప్పుకున్నారు.
అప్పట్లో డ్రైవర్లు పని చేసే తీరు, ఆటో డ్రైవర్ల సెంటిమెంట్లు, డ్రైవర్ల నిక్ నేమ్స్ చెప్తూ నాన్నగారి బాస్ తన ఆటో ఎక్కినప్పుడు తరచి తరచి అడిగినా తన ఐడెంటిటీని దాచిపెట్టడం, సిండికేట్ బ్యాంక్ వారి కుక్క లోగోను ఆటో మీద చిత్రించడంతో ఆటోలను కుక్కపిల్ల ఆటోలుగా వ్యవహరించడం వంటి విషయాలను చెప్పిన తీరు బాగుంది.
పైగా రకరకాల మనుషులను వారి వారి గమ్యస్థానాలకు తన ఆటలో తీసుకుపోయిన చక్రధర్ గారికి ఎదురైన సంఘటనలు ఆశ్చర్యం కలిగించాయి. ...విస్మయపరిచాయి....ఔరా అనిపించాయి...ఎప్పటికప్పుడు కొత్త పాఠమే... అయితే వాటిని తమదైన శైలిలో నడిపించిన వాస్తవ కథనాలు చదువుతుంటే ప్రత్యక్షంగా చూస్తున్నట్టే ఫీలయ్యాను.
మందలపర్తి కిశోర్ గారు ఈ పుస్తకం గురించి రాస్తూ " జ్ఞాపకం ఆత్మకు అక్షర రూపమన్నాడు ఓ పెద్దాయన. జ్ఞాపకాలు గతానుభవానికి ధర్మకర్తల్లాంటివన్నాడు మరో పెద్దాయన. గతంలో కన్నీరు కార్చిన సంఘటనలను తలపోసుకుంటే ఒకోసారి నవ్వొస్తుంది. గతంలో నవ్వుకున్న విషయాలు కొన్నింటిని తల్చుకుంటే ఏడుపూ ఒస్తుంది మరి. కానీ జ్ఞాపకమనేది విషాదమూ కాదు. వినోదమూ కాదు. నవ్వైనా ఏడుపైనా జ్ఞాపకంగా మారిన తర్వాతే దాని విలువ తెలిసొస్తుంది .... ఎన్నో సిరిసంపదలనూ ఎందరో బంధుమిత్రులనూ కోల్పోయి వుండొచ్చు. జ్ఞాపక కథలు వాటినీ, వారిని తెచ్చి మనముందు సజీవంగా నిలబెడతాయి...గతాన్ని మర్చిపోనివాడు దేన్నీ కోల్పోడన్నమాట. చక్రధర్ అలాంటివారిలో ఒకరు" అనడం అక్షరసత్యం.
బతుకుతెరువు కోసం రిస్కులు తీసుకుంటూ ప్రయాణీకులను సరుకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆటో, టాక్సీ, బస్సు, ట్రక్కు డ్రైవర్లకు అంకితమిచ్చిన చక్రధర్ గారు ఆసక్తిగా చదివించడానికి నాటకీయత జోడించానంతే అన్నారు కానీ అలా ఎక్కడా అనిపించక ఉన్నది ఉన్నట్టు చెప్పినట్టే అనిపించింది. అది అక్షరానికున్న శక్తి. భావానికున్న యుక్తి.
పాత్రికేయుడవడంతో తన కథనాలకు పెట్టిన శీర్షికలు చదవడంతోనే లోపల ఏముందో ఏమిటో చదివెయ్యాలనే ఆరాటం పాఠకుడికి కలిగి తీరుతుంది. మచ్చుకి కొన్ని శీర్షికలు – పాపం మేనేజర్, అర్థరాత్రి ఆటో స్టాండ్ – ఒంటరి యువతి, ప్రేమపక్షులు, రౌడీల వేట, ప్రమాదం ప్రమోదం, డిక్కీలో డెడ్ బాడీ, మోహరాగం...!! రౌడీల ఆట కట్టించడానికి ఓ ఎస్సై అర్థరాత్రి చేపట్టిన ఆపరేషన్, ఓ డ్రైవరుతో నువ్వా నేనా అని బాహాబాహీ కలబడాల్సి రావడం, ఆటో డిక్కీలో శవాన్ని తీసుకెళ్ళిన దశాబ్దాల క్రితం నాటి దైన్యస్థితే నేటికీ కొనసాగడం ఏ ప్రగతికి సంకేతం అని ప్రశ్నించిన సంఘటన,తన గురువు జ్యోతిష్య సంఖ్య శాస్త్రవేత్త పరిమిసాంబయ్య మాష్టారు గురించి...ఇలా ప్రతి అధ్యాయం ఆసక్తిదాయకం. సంప్రదాయ ఆలోచనలతో వెనక్కి లాగే కుటుంబ పెద్దల కట్టుబాట్లు దాటుకుని సొంతకాళ్ళ మీద నిలబడిన చక్రధర్ గారి జీవితపయనంలోని ఆటో ఛాప్టర్ మిగిల్చిన అపురూప అనుభవామాలికే గ్రాడ్యుయేట్ ఆయో సర్వీస్ పేజీలు. ఆకలి, పేదరికం వెనక వెతలను స్వయంగా చూడగలిగే జీవన కార్యకలాపాలను భిన్న కోణాల్లో చూడగలిగే అవకాశాలు ఆయనకు లభించడం, వాటికి చక్కని రూపంలో మాటలివ్వడం వల్ల ఆద్యంతమూ చదవాలనే ఆసక్తి కలిగింది.
జి. వల్లీశ్వర్ గారు చెప్పినట్లు ఆటో నడపటం, పత్రికల్లో పని చేయడం, జర్నలిజం పాఠాలు చెప్పటం, పుస్తకాలు రాయటం, ప్రచురించటం, విక్రయించటం ఇవన్నీ వేర్వేరు విషయాలైనా చక్రధర్ గారు మాత్రం అవన్నీ ఒక్కటే అన్న చందంలో ముందుకు సాగుతూ ఆత్మగౌరవానికి భంగం కలిగించక మనసుకి తృప్తినిచ్చే ఈ పనైనా చేయవచ్చనే ఆత్మవిశ్వాసాన్ని కల్పించారీ పుస్తకంతో.
చివర్లో స్ఫూర్తి కథనాల పేరిట పొందు పరచిన రెండు నిజ సంఘటనలు నిజ్జంగా స్ఫూర్తిదాయకమే.
ప్రతులు కావలసినవారు 9849870250 నెంబరుకి ఫోన్ పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా రూ. 120 పంపి పొందవచ్చును.

చక్రి..ఆరోగ్యమస్తు.
- శ్రీధర్ అక్కినేని.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి