అసూయ! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఒకరు మనకన్నా అధికులుగా ఉన్నారంటే అసూయ పగతగదు.వారిలాగా మనం ప్రయత్నించాలి.స్పర్ధయా వర్ధతే విద్యా అన్నారు. ఆబడిలో చదివే శివా  ఓఅధికారి కొడుకు. క్లాస్ లో ఎప్పుడూ ఫస్ట్.కానీ కొత్తగా చేరిన హరి తనని మించి మార్కులు తెచ్చుకోవడంతో వాడి కడుపు కుతకుతలాడుతోంది.హరిని ఈసారి పరీక్షలు రాయనీయకుండా చేయాలి అనే ప్లాన్ చేస్తున్నాడు.ఆసాయంత్రం తనసైకిల్ పై బలవంతంగా ఎక్కించాడు. "మీఇంటిదగ్గర దింపుతా" అంటూ.సైకిల్ మీద నుంచి కింద పడేసి దెబ్బలు హరికి తగిలేలా చూడాలని వాడి ప్లాన్."ఆ!అదే మాచాయ్ దుకాణం " హరి అరుపుతో  ఆశ్చర్యపోయాడు శివా. హరి కొత్తగా వేరే ప్రాంతం నించి ఇక్కడికి వచ్చాడు. ఆఇంటి ఓనర్ ఇల్లు అమ్మేయటంతో మూసాపేటలో బంధువుల సాయంతో తండ్రి చాయ్ దుకాణం పెట్టాడు. తల్లి దోసెలు ఇడ్లీలు వేడివేడిగాచేసి అమ్ముతుంది.కూలీనాలీజనం క్యూకట్టి వాటిని తినేసి పోతారు.రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం లో పుట్టిన హరి ఇంటికి వెళ్లి వారికి  సాయం చేస్తాడు. "శివా!రా!మాఅమ్మ ఇప్పుడు పకోడీలు వేస్తుంది. తిందువుగాని" శివా ని పిల్చాడు. అతని అమ్మా నాన్న లు కూడా ఆప్యాయంగా పలకరించి  కొసరి కొసరి తినిపించటంతో శివా మనసు పశ్చాత్తాపం తో దహించుకుపోసాగింది."బాబూ!హరికి ఏమైనా తెలీకుంటే చెప్పుబాబూ!నీవు మంచి తెలివిగలబాబువి అని హరి చెప్తాడు రోజూ!"అంటున్న వారి మాటలకు శివా చలించిపోయాడు."పిన్నీ !నాదగ్గర డబ్బులు లేవు. రేపు తెచ్చి ఇస్తా" అన్న శివా తో"ఛ..ఛ. హరి తో సమానం నాయనా నీవు. వాడికి  అన్నదమ్ములు లేరుగా? బడిలో అందరితో కలిసిమెలసి ఉండాలి ".హరి బల్లపై ప్లేట్లు తీసేసి బల్లశుభ్రంగా తుడిచి అమ్మా నాన్నలకు సాయం చేయడం చూసిన శివా తన చెడుఆలోచనకు కుంగిపోయాడు.ఇదే మనలో రావాల్సిన మార్పు 🌷
కామెంట్‌లు