సాహసం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఏపనైనా ముందు భయం అనిపిస్తుంది. కానీ ధైర్యం చేసి చేస్తూ పోవాలి.ఆమేకలమంద రోజూ కొండప్రాంతంలో మేతకు వెళ్లేవి.ఓతోడేలు హఠాత్తుగా ఒకదాన్ని లాక్కుని పోయింది. వారంతర్వాత మేకలకాపరి గమనించి వాటిని బైట కి పంపడం లేదు. ఓమేకకి ఇదినచ్చలేదు.అందరంకల్సి తోడేలుని చంపుదాం.స్వేచ్ఛగా తిరుగుదాం అంటే మిగతావి మేము రాము అన్నాయి.ఆరోజు మేక ఒక్కతే ఆకొండప్రాంతానికెళ్లి తోడేలుని చూసి మామా అని పలకరించింది. అది వచ్చేలోగా పెద్ద బండచాటున నక్కి కొమ్మలతో తోడేలుని కుమ్మింది.ఆహఠాత్తు పరిణామం కి తోడేలు కళ్ళు గీరుకుపోయాయి.వెంటనే రాళ్ళ గుట్టని దానిపై దొర్లించటంతో అదికాస్తా లోయలో పడి ప్రాణాలు వదలటం జరిగింది. మేక ఇంటికి వచ్చి తను చేసిన సాహసం చెప్పింది. కాపరి అన్నాడు "మీలోమీకే నమ్మకం ఐక్యత లేదు. కష్టపడే స్వభావం కూడా లేదు.జయం మనదే అని దృఢసంకల్పంతో పనిచేయాలి" అనగానే మిగతావి సిగ్గుతో తలవాల్చాయి.🌹
కామెంట్‌లు