శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 విజ్ఞానం అంటే సైన్స్.దీని ఇంకో అర్థం కార్యకుశలత మాయ అవిద్య.సంస్కృతంలో ముఖ్య అర్థం జ్ఞానం! దాని నుంచి బుద్ధి వివేకం దక్షత కౌశలం వచ్చాయి.వేదాంతం ప్రకారం ఆత్మ పంచకోశాల్లో బుద్ధి ప్రధమం.బౌద్ధ 
దర్శనం లో విజ్ఞాన వాదం అనే సిద్ధాంతం ఉంది. సంస్కృతంలో సంగీతం 14 విద్యల గ్నానం.నేడు మనం సైన్స్ అనే అర్థం లో వాడుతున్నాం.దాదాపు అన్ని భాషల్లో ఇదే అర్థం
విహంగావలికనం అంటే పూర్తి గా చదవకుండా పైపైన పుస్తకం తిరగేయటం.విహంగం అంటే సంస్కృతంలో పక్షి అని అర్థం.ఆకాశంలో ఎగిరే పక్షులు అన్ని చూస్తాయి కానీ స్పష్టం గా ఏదీ కన్పడదు
విషకన్యలని పూర్వం శత్రువు వి చంపటానికి పంపేవారు.బాల్యం నుంచి ఓ ఆడపిల్ల కి విషం తినిపించి విషకన్యగా మార్చేవారు.ఆమెను స్పృశించి తే చాలు చనిపోతారు.ఇప్పుడు మానవబాంబు లాగా అన్నమాట!
విష్ణు అంటే ఉదాసీనత దుఃఖం ఇచ్ఛాశక్తిలేని  ఉత్సాహం లేని అని అర్థం.ఎవరైనా చనిపోతే విష్ణు వదనంతో ఉంటాం.కానీ సంస్కృతం లో విడిగా కూచున్నవాడు అనే అర్థంలో వాడుతున్నాం.ఒంటరిగా అందరికీ దూరంగా కూచుని బాధపడేవారు.
విశ్వామిత్రుడు అంటే మహా కోపిష్టి అని తెలుసు.రామలక్ష్మణులను తనతో తాటకి వీధికి తీసుకుని వెళ్లాడు.అసలు అర్ధం విశ్వం అంటే ప్రపంచానికి మిత్రుడు అని అర్థం.పురువంశ రాజైన గాంధి పుత్రుడు.క్షత్రియునిగా ఆయన పేరు విశ్వరథుడు.బ్రాహ్మణత్వం పొంది విశ్వామిత్రుడిగా మారాడు.ఈయనభార్యపేరు సతి.శునఃశేప ధనుంజయ మొదలైన 100మంది కొడుకులు పుట్టారు.మేనకవల్ల శకుంతల పుట్టింది.అనేక ధర్మగ్రంథాలు రాశాడు.
విశ్రాంత అంటే అలసిన రిటైరైన అనే అర్థంలో వాడుతున్నాం.అసలు అర్థం విశ్రమించటానికై ఆగటం అని!రెస్ట్ తీసుకోటం!
విశ్వరూపం అంటే విష్ణు శివ కృష్ణ అని హిందీ శబ్ద కోపంలో ఉంది.భగవద్గీత చెప్తూ కృష్ణుడు విశ్వరూపం చూపించాడు.విశ్వకర్మ ఒక కొడుకు పేరు విశ్వరూప.అతనికి మూడు శిరస్సులు ముఖాలు న్నాయి.అతన్ని త్రిశిర అన్నారు.ఇంద్రునిచే అవమానం పొందిన బృహస్పతి ఎక్కడో దాగున్నాడు అప్పుడు దేవతలు విశ్వరూపుని తమ గురువు గా ఎంచుకున్నారు.కానీ అతను యజ్ఞంలో ఒక భాగంని అసురులకి ఇచ్చేవాడు.ఇంద్రుడు కోపంతో అతని మూడు శిరస్సులు ఖండించాడు.విశ్వకర్మ  కోపంతో ఇంద్రుని చంపగలిగే శక్తి ఉన్న వృత్తాసురుని సృజించాడు.🌹

కామెంట్‌లు